English | Telugu
రిషిపై ఎటాక్ చేసిన రౌడీలు తప్పించుకున్నట్టేనా!
Updated : Aug 5, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -833 లో.. మహేంద్రకి వసుధార ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది. సర్ నాకు రిషి సర్ ని చూడాలని ఉందని, ఒక్కసారి వీడియో కాల్ చేస్తారా అని అడుగుతుంది. నాకు తెలుసమ్మా.. నీకు రిషి అంటే ఎంత ఇష్టమో, ఇద్దరు ఒకరికొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. సరే వీడియో కాల్ చేస్తున్నా అని వసుధారకి మహేంద్ర వీడియో కాల్ చేసి రిషిని చూపిస్తాడు. రిషిని చూడగానే వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత విశ్వనాథ్ ఇంటికి ఇన్‌స్పెక్టర్ వస్తాడు. థాంక్స్ సర్ నేను ఫోన్ చెయ్యగానే త్వరగా రెస్పాండ్ అయి వచ్చారని ఇన్ స్పెక్టర్ తో మహేంద్ర అంటాడు. మీరు రిషిపై ఎటాక్ చేసిందెవరో, పర్సనల్ గా తీసుకొని ఎంక్వయిరీ చెయ్యండని విశ్వనాథ్ అంటాడు. సరే సర్ మీరు టెన్షన్ పడకండి. ఆ రౌడీలను నేను పట్టుకుంటానని ఇన్‌స్పెక్టర్ అంటాడు. రౌడీలందరిని పిలిపిస్తాను, ఐడెంటిఫై చేస్తే రౌడీలు ఎవరో తెలుస్తుందని ఇన్‌స్పెక్టర్ అంటాడు. అయితే నేను, రిషి, వసుధర స్టేషన్ వస్తామని మహేంద్ర అంటాడు. మరొకవైపు శైలేంద్ర ప్లాన్ లు అన్ని ఫెయిల్ అవుతున్నాయని చిరాకులో ఉంటాడు.
అప్పుడే ఒక రౌడీ ఫోన్ చేసి సర్ మేం ఇక్కడ నుండి దూరంగా వెళ్లిపోతున్నాం, పోలీసులు రౌడీలని ఐడెంటీఫై కి పిలిచి విచారిస్తున్నారంట, మేం గాని దొరికితే నిజమంతా బయటపడుతుందని ఆ రౌడీ అంటాడు. సరే మీరు వెళ్ళండి ఆ ఫ్యూన్ ని కూడా తీసుకొని వెళ్ళండని రౌడీకి శైలేంద్ర చెప్తాడు. ఇక నేనే రంగం లోకి దిగి, ఆ రిషి గాన్ని వేసేయాలని శైలేంద్ర అనుకుంటాడు. మరొకవైపు రిషి, వసుధార, మహేంద్ర స్టేషన్ కి వెళ్లి కొంతమంది రౌడీలను చూస్తారు. వాళ్లలో రిషి పై ఎటాక్ చేసిన వాళ్ళు లేరని ఇన్‌స్పెక్టర్ తో రిషి చెప్తాడు. ఆ తర్వాత స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత.. నువ్వు జాగ్రత్త అని రిషిని హగ్ చేసుకుంటాడు మహేంద్ర. మీరు వెళ్ళండి డాడ్ అక్కడ కాలేజీ ని చూసుకోవాలి కదా అని మహేంద్రతో రిషి చెప్తాడు.
ఆ తర్వాత పాండియన్ అతని ఫ్రెండ్స్ రిషిపై ఎటాక్ జరిగిందని తెలిసి, రిషి సర్ కి ఇక మనం సెక్యూరిటీ లాగా ఉందామని అనుకుంటారు. అప్పుడే రిషి వస్తుఙటాడు రిషి వెనకాల సెక్యూరిటీ లాగా పాండియన్, అతని ఫ్రెండ్స్ వెళ్తుంటారు. ఇక నుండి మీకు సెక్యూరిటీ లాగా ఉంటామని పాండియన్ చెప్పగానే .. వద్దు మీరు చదువుకోవడానికి వచ్చారు. అది నా పర్సనల్ అంటూ పాండియన్ వాళ్ళకి రిషి చెప్తాడు. మరొకవైపు మహేంద్ర ఇంటికి వెళ్లి.. జగతికి జరిగిందంతా చెప్తాడు. రిషి తన గురించి మాట్లాడిన మాటలన్నీ చెప్పగానే జగతి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.