English | Telugu

ఫీమేల్ హైజీన్.. మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్న వితిక షేరు!

వితిక షేరు.. ఎన్నో ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న, సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. చాలా మందికి తెలియని నటి. బిగ్ బాస్ సీజన్-3 లో తన భర్త వరుణ్ సందేశ్ తో కలిసి ఎంట్రీ ఇచ్చి అందరిచూపు తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత వితిక మంచి క్రేజ్ సంపాదించుకొని బిజీ జీవితాన్ని గడుపుతుంది.

వితిక షేరు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఒక సిరీస్ తో మొదలైంది తన కెరీర్. అలాగే చాలా సినిమాలలో నటించింది. వితిక తెలుగు, కన్నడ, తమిళ్ లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఝమ్మంది నాదం, భీమీలి కబడ్డి జట్టు, పడ్డానండి ప్రేమలో, పెళ్లి సందడిలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత 'వితిక షేరు' అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి, మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది. వితిక, హీరో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది. వితిక, వరుణ్ ఇద్దరు రియల్ కపుల్ గా బిగ్ బాస్ 3 లో అడుగుపెట్టి, తమలోని మరొక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. హౌస్ లో వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ తో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. భార్యభర్తల గిల్లికజ్జల సీజన్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ గా సాగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇద్దరు చాలా యాడ్స్ లో కలిసి నటించారు.

వితిక అందరికంటే కాస్త భిన్నంగా, ఎప్పుడు కొత్తదనం కోసం ట్రై చేస్తుంటుంది. అలాగే ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. ఏదైనా విషయం చెప్తే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే విషయం పక్కన పెట్టి, ఎలా తీసుకున్నా మంచి విషయం షేర్ చెయ్యాలనే ఆలోచిస్తుంటుంది. అందుకే ఎప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో భిన్నమైన టాపిక్స్ తో వ్లాగ్ లు, వీడియోలు చేస్తుంది. ' మా ఊరిలో' అంటూ తన ఊళ్ళో ఎలా ఉండేదో చెప్తూ ఒక వ్లాగ్, ' స్కూల్.. టీచ్ ఫర్ చేంజ్ ' అంటూ మరొక వ్లాగ్.. ఇలా కొత్తదనంతో కంటెంట్ చేస్తూ యూట్యూబ్ లో టాక్ ఆఫ్ ది ట్రెండింగ్ గా మారింది వితిక. తాజాగా వితిక ఆడవాళ్ళ సేఫ్టీ గురించి కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ.. " ఫీమేల్ హైజీన్ " మోస్ట్ ఇంపార్టెంట్ అంటూ ఒక వీడీయోని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఆడవాళ్ళు ఆ టైమ్ లో ఎలా ఉండాలో చెప్తూ, ఇది మహిళలకు చాలా ఇంపార్టెంట్ అంటూ కొన్ని జాగ్రత్తలు చెప్పింది వితిక. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.