English | Telugu
అగ్రిమెంట్ పూర్తయ్యాక కృష్ణ వెళ్ళకుండా రేవతి ఆపగలదా!
Updated : Aug 5, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -227లో.. కృష్ణ, మురారిల గదిలోకి రేవతి వస్తుంది. ఎక్కడ చూసిన కృష్ణ మురారిలు కన్పించడం లేదేంటి, ఎక్కడికి వెళ్లారని రేవతి అనుకొని బయటకు వస్తుండగా కృష్ణ అగ్రిమెంట్ పూర్తి అయ్యేరోజును కృష్ణ క్యాలెండరు పై పెన్ తో మార్క్ చేసి పెట్టడం.. రేవతి చూసి షాక్ అవుతుంది. అంటే కృష్ణ అగ్రిమెంట్ డేట్ పూర్తి అవగానే వెళ్ళిపోతుందా అని రేవతి బాధపడుతుంది. అది ఎలా వెళ్తుంది.. వీడెలా పంపిస్తాడో నేను చూస్తానని రేవతి అనుకుంటుంది.
మరొక వైపు మురారి మాట్లాడిన మాటలను నందు గుర్తు చేసుకొని బాధపడుతుంటుంది. ఏంటి నందు నువ్వు డల్ గా ఉన్నావ్.. ఇన్ని రోజులు మా వాళ్ళని మిస్ అవుతున్నా అన్నావ్. ఇప్పుడు మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇలా డల్ అయ్యవని గౌతమ్ అంటాడు. కృష్ణ మురారిల పేర్లు చెప్పకుండా ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నారని చెప్తుంది నందు. వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళని నందు చెప్తుంది. ఎవరైనా సరే నువ్వు డల్ గా ఉంటే నచ్చదని గౌతమ్ అంటాడు. మరొక వైపు రేవతి మురారి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. ఒకవైపు కోపం మరొక వైపు బాధగా రేవతి మాట్లాడుతుంది. మీ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి నాకు తెలుసు.. అగ్రిమెంట్ పూర్తి కాగానే కృష్ణ వెళ్ళిపోతుందా? పెళ్లి అంటే ఏం అనుకుంటున్నారు. కృష్ణ అంటే నీకు ఇష్టం లేదా అని మురారిని రేవతి అడుగుతుంది. ఇష్టం ఉందని చెప్తే అమ్మ నాకోసం కృష్ణని బలవంతంగా ఇక్కడ ఉండేలా చేస్తుంది. అసలు కృష్ణకి నాపై ప్రేమ లేదని ఎలా చెప్పాలని మురారి అనుకుంటాడు. అమ్మ నాకు కృష్ణ అంటే ఇష్టం లేదని మురారి చెప్పగానే.. మురారి చెంప చెల్లుమనిపిస్తుంది రేవతి. ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశారంటూ రేవతి బాధపడుతుంది.
ఆ తర్వాత కృష్ణ దగ్గరికి రేవతి వెళ్తుంది. మీ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి నాకు ఎప్పుడో తెలుసని అనగానే, అందుకేనా మమ్మల్ని ఫామ్ హౌస్ కి పంపించారని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. కృష్ణ నువ్వు అగ్రిమెంట్ కాగానే వెళ్ళిపోతావా అని రేవతి అడుగుతుంది. కృష్ణ తన బాధని బయటకు చెప్పకుండా వెళ్ళిపోతానని అంటుంది. మురారి అంటే ఇష్టం లేదా అని రేవతి అడుగుతుంది. ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం కానీ ఇప్పుడు నా ప్రేమని మీకు చెప్తే ఏసీపీ సర్ తన మనసులో వేరొక అమ్మాయి ఉందని తెలుస్తుందని కృష్ణ మనసులో అనుకుంటుంది. కృష్ణ, రేవతి మాటలన్ని చాటుగా అలేఖ్య వింటుంది. కృష్ణ చెప్పు ఇలా నాతో కూడా ఇదంతా చెప్పాలని అనిపించలేదా అని రేవతి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.