English | Telugu

అఖండ హైందవం.. ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూసేందుకు మరో రెండు రోజులు ఆగక తప్పదు. డిసెంబర్‌ 4 రాత్రి 9.30గంటలకు ప్రీమియర్స్‌తో అఖండ తాండవం మొదలు కాబోతోంది. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, పాటలు.. సినిమాకి మరింత హైప్‌ తీసుకొచ్చాయి. 'అఖండ2'కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా వాళ్ళు, వీళ్లు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా విడుదలైన 'అఖండ హైందవం' సాంగ్‌ సినిమాకి మరింత డివోషనల్‌ టచ్‌ ఇచ్చింది. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా చూసెయ్యాలన్నంత ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు మేకర్స్‌.

తాజాగా ఈ సినిమాలోని 'అఖండ హైందవం..' అంటూ సాగే పాటను విడుదల చేశారు. లిరికల్‌ వీడియోగా విడుదలైన ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్‌ ఆలపించారు. ఈ పాట మొదలైన దగ్గర నుంచి చివరి వరకు లిరిక్స్‌గానీ, మ్యూజిక్‌గానీ, పాటలోని విజువల్స్‌గానీ గూస్‌బంప్స్‌ తెప్పించే విధంగా ఉన్నాయి. సినిమాలోని పాటలన్నీ శివతత్వంతో నిండిపోయి ఉండడంతో 'అఖండ2' ప్రేక్షకుల్ని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లి.. వారికి ఒక మధురానుభూతిని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నాగ గురునాథశర్మ లిరిక్స్‌ అందించిన 'అఖండ హైందవం' సాంగ్‌ను సర్వేపల్లి సిస్టర్స్‌ ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఈ లిరికల్‌ వీడియోను వారిపైనే చిత్రీకరించడం విశేషం. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, థమన్‌.. ఈ ముగ్గురికీ 'అఖండ2' ఒక మైల్‌స్టోన్‌లాంటి సినిమా అవుతుందని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి థమన్‌ పెట్టిన ఎఫర్ట్‌ మామూలుగా లేదని సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజా' చిత్రం విడుదలైంది. ఈ సినిమాకి తమన్‌ చేసిన మ్యూజిక్‌కి, ఈ ఏడాది చివరలో వస్తున్న 'అఖండ2' సంగీతానికి చాలా డిఫరెన్స్‌ ఉంది. పాటల విషయంలోగానీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో గానీ ఎంతో కేర్‌ తీసుకున్న థమన్‌కి అతని కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ ఆల్బమ్‌ అవుతుంది. సంయుక్త మీనన్‌, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. డిసెంబర్‌ 4న ప్రీమియర్స్‌తో ప్రారంభమయ్యే 'అఖండ2' డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.