English | Telugu

ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌.. వారణాసిలో షర్ట్‌లెస్‌ మహేష్‌ని చూస్తారు

సినిమాల్లో హీరో అంటే విలన్లను, వారి అనుచరులను చితక్కొట్టేంత పవర్‌ ఉన్నవాడు. ఎంత మంది ఎదురొచ్చినా వారిని మట్టి కరిపిస్తూ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటాడు. దుష్టశక్తులను ఎదుర్కోవాలంటే హీరోకి గుండె బలంతోపాటు కండబలం కూడా ఉండాలి. అప్పుడే హీరో చేసే విన్యాసాలకు జస్టిఫికేషన్‌ వస్తుంది.


పాతతరం హీరోలకు ఇలాంటి క్వాలిటీస్‌ లేకపోయినా నెగ్గుకు రాగలిగారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పటి ప్రేక్షకుల టేస్ట్‌ వేరు. హీరో ఒక్క దెబ్బ కొట్టాడంటే విలన్‌కి చుక్కలు కనిపించాలి. అలాంటి ఎఫెక్ట్‌ రావాలంటే హీరో కండల వీరుడై ఉండాలి. ఇప్పటి జనరేషన్‌ హీరోలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, క్యారెక్టర్‌ డిమాండ్‌ మేరకు తమ శరీరాకృతిని మార్చుకుంటూ వస్తున్నారు. అవసరమైతే షర్ట్‌ లేకుండా తమ కండలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.


చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలను వదిలేస్తే ఆ తర్వాత వచ్చిన హీరోల్లో మొదట 'తమ్ముడు' చిత్రంలో షర్ట్‌లెస్‌గా కనిపించాడు పవన్‌కళ్యాణ్‌. చాలా కాలం తర్వాత 2007లో పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'దేశముదురు' కోసం అల్లు అర్జున్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో దర్శనమిచ్చాడు. ఆరోజుల్లో మీడియాలో, ప్రేక్షకుల్లో ఇదొక సెన్సేషనల్‌ టాపిక్‌ అయింది. ఇక అప్పటి నుంచి మిగతా హీరోలు కూడా షర్ట్‌లెస్‌గా కనిపించే సందర్భం వస్తే దాన్ని విడిచిపెట్టలేదు. 'బుజ్జిగాడు' సినిమాలో ప్రభాస్‌ తన షర్ట్‌ విప్పి కండలు చూపిస్తూ ఫైట్‌ చేసే సీన్‌ ఉంటుంది. ఈ సినిమాకి కూడా పూరి జగన్నాథే డైరెక్టర్‌ కావడం విశేషం. ఆ తర్వాత మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో తన క్యారెక్టర్‌ కోసం ప్రభాస్‌ ఎంత హెవీ బాడీ మెయిన్‌టెయిన్‌ చేశాడో మనం చూశాం.


అలాగే ఎన్టీఆర్‌ కూడా 'టెంపర్‌' కోసం షర్ట్‌లెస్‌గా కనిపించాడు. ఈ సినిమాకి కూడా పూరి జగన్నాథే దర్శకుడు కావడం మరో విశేషం. రామ్‌చరణ్‌ విషయానికి వస్తే 'ధృవ' చిత్రంలో తన సిక్స్‌ ప్యాక్‌ బాడీని ప్రదర్శించాడు. 2000వ దశకం నుంచి హీరోలుగా కొనసాగుతున్న హీరోలంతా దాదాపు ఏదో ఒక సందర్భంలో షర్ట్‌లెస్‌గా కనిపించి ప్రేక్షకులతో, అభిమానులతో చప్పట్లు కొట్టించుకున్నారు. అయితే టాలీవుడ్‌లో టాప్‌ హీరోలుగా ఉన్నవారిలో మహేష్‌బాబు ఒక్కడే ఆ ప్రయత్నం చెయ్యలేదు.


మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబల్‌ మూవీగా వస్తున్న 'వారణాసి' చిత్రంలో ఫర్‌ ద ఫస్ట్‌ టైమ్‌ మహేష్‌ షర్ట్‌లెస్‌గా కనిపించబోతున్నాడు అనేది లేటెస్ట్‌ న్యూస్‌. అందుకే ఈ సినిమా ప్రారంభానికి ముందే ఫిజికల్‌గా కఠినమైన ట్రైనింగ్‌ తీసుకున్నాడు మహేష్‌. ఇది ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే అడ్వంచరస్‌ మూవీ. కాబట్టి హీరో కండల ప్రదర్శన అనేది అవసరం. అది సినిమాకి అడ్వాంటేజ్‌ కూడా అవుతుంది. ఆ ఆలోచనతోనే మహేష్‌ని రాజమౌళి మొదటి నుంచీ ప్రిపేర్‌ చేసినట్టుగా కనిపిస్తోంది.


తను 'వారణాసి'లో షర్ట్‌లెస్‌గా కనిపించబోతున్నాననే విషయాన్ని ఆమధ్య రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఈవెంట్‌లోనే మహేష్‌ రివీల్‌ చేశాడు. తను ఈవెంట్‌లో ఎలా కనిపించాలి అనేది రాజమౌళే డిసైడ్‌ చేశాడని, తను రెగ్యులర్‌గా ఈవెంట్స్‌కి వచ్చే డ్రెస్‌లో వస్తానంటే కుదరదని చెప్పి తన కాస్ట్యూమ్‌ని కూడా ఆయనే సెలెక్ట్‌ చేశాడని చెబుతూ.. 'ఇంకా నయం షర్ట్‌ లేకుండా రమ్మనలేదు' అంటూ ఒక హింట్‌ ఇచ్చాడు మహేష్‌. అతను అలా మాట్లాడడం వెనుక 'వారణాసి'లో తను షర్ట్‌ లేకుండా కనిపిస్తానని చెప్పడమేనని అందరూ భావిస్తున్నారు. సో.. 'వారణాసి' సినిమాలో మొదటిసారి మహేష్‌ని షర్ట్‌ లేకుండా చూడబోతున్నామన్నమాట.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.