English | Telugu

ఎపిక్.. సందీప్ రెడ్డి సినిమాలో హీరో లాంటి అమ్మాయితో ప్రేమలో పడితే..?

'90s' వెబ్ సిరీస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్.. దర్శకుడిగా వెండితెర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో.. బేబీ జోడి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ ను విడుదల చేశారు.

'90s' వెబ్ సిరీస్ లో రోహన్ పోషించిన ఆదిత్య పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అతను పెద్దయ్యాక లండన్ కి వెళ్తే, అక్కడ ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపిస్తూ.. దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. (Epic - First Semester)

రెండున్నర నిమిషాల నిడివితో రూపొందిన ఎపిక్ టైటిల్ గ్లింప్స్‌ ఆకట్టుకుంటోంది. తనకి ఎలాంటి భర్త రావాలో వైష్ణవి చైతన్య తన ఫ్రెండ్స్ తో చెప్పే సీన్ తో గ్లింప్స్‌ ప్రారంభమైంది. ఆ చెప్పే క్వాలిటీస్ ని పూర్తి భిన్నంగా చిన్నప్పుడు ఆదిత్య ఎలా ఉండేవాడో చూపించడం సరదాగా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ లో గోరేటి వెంకన్న పాట వస్తుండగా.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గెటప్ ని గుర్తు చేస్తూ.. ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. అలాగే "శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ" అనే డైలాగ్ తో సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు.

Also Read:సమంత రెండో పెళ్లి.. పూనమ్ సంచలన ట్వీట్!

90s డైరెక్టర్ గా, ప్రేమలు డైలాగ్ రైటర్ గా, లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూసర్ గా వరుస సక్సెస్ లు చూశాడు ఆదిత్య హాసన్. 'ఎపిక్' గ్లింప్స్‌ చూస్తుంటే డైరెక్టర్ గా అతని సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ సాలిడ్ గా ఉండబోతుంది అనిపిస్తోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.