English | Telugu

ఆంధ్రాకింగ్ తాలూకా విషయంలో పరిశ్రమ ఫెయిల్..భాగ్యశ్రీ బోర్సే ట్వీట్!

-నిజంగానే భాగ్యశ్రీ బోర్సే ట్వీట్ చేసిందా!
-కలెక్షన్స్ ఎన్ని
-టాక్ బాగానే ఉంది


సిల్వర్ స్క్రీన్ పై ఎంతో ఎనర్జీతో పెర్ఫార్మ్ చేసే హీరోల్లో 'రామ్ పోతినేని'(Ram Pothineni)కూడా ఒకరు. గత నెల 27 న మాస్ అండ్ రొమాంటిక్ డ్రామా 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra king taluka)తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. ఉదయం 8 గంటల ఆట నుంచే పర్వాలేదనే టాక్ ని తెచ్చుకుంది. ఎక్కువ శాతం రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. తాను అభిమానించే హీరో కోసం తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి సిద్దపడ్డ 'సాగర్' క్యారక్టర్ లో రామ్ నటన చాలా బాగుందని సినీ విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. మహాలక్షి క్యారక్టర్ లో 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse)తన అందంతో పాటు అంతకంటే అందమైన నటనతో కట్టిపడేసిందని కూడా ముక్తకంఠంతో చెప్పారు. కానీ కలెక్షన్స్ మాత్రం డల్ గా ఉన్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.


ఈ నేపథ్యంలో 'ఆంధ్రా కింగ్ విషయంలో టాలీవుడ్ ఫెయిల్ అయింది' అని భాగ్యశ్రీ బోర్సే చేసిన ట్వీట్ ఇదేనంటూ సదరు ట్వీట్ ఇండస్ట్రీలో కాంట్రవర్శీగా మారడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీ బాగున్నా కలెక్షన్లు మాత్రం నిరాశపరుస్తుండటంతో ఆ పోస్ట్‌ను చాలామంది భాగ్యశ్రీ బోర్సే చేసిందని భావించారు. కానీ ఆ ట్వీట్ భాగ్యశ్రీ బోర్సే చెయ్యలేదు. ఆమె పేరుతో ఎవరో చేసారు. ఏది ఏమైనా ఆ ట్వీట్ తో సోషల్ మీడియా వేదికగా మూవీ లవర్స్ స్పందిస్తు బాగున్న సినిమాలని కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది థియేటర్స్ కి వెళ్లి చూడటం లేదు.

also read:అప్పుడు మా అమ్మ, ఇప్పుడు ధర్మేంద్ర.. జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు

ఓటిటి లో చూసాక సినిమా చాలా బాగుంది కదా అని అనుకోవడం అలావాటు అయిపోయింది.అన్ని అంశాలు మిక్స్ అయి ఉన్న ఆంధ్ర కింగ్ తాలూకా ని థియేటర్ లో చూస్తూనే బాగుంటుందనే కామెంట్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుమారు 70 కోట్ల రూపాయలతో ఆంధ్ర కింగ్ తాలూకా ని నిర్మించగా మహేష్ బాబు పి(Mahesh Babu.P)దర్శకత్వం వహించాడు. సూర్య కుమార్ అనే సినిమా హీరో క్యారక్టర్ ల కన్నడ స్టార్ ఉపేంద్ర మెస్మరైజ్ చేసాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.