English | Telugu

విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కమల్ సంచలన వ్యాఖ్యలు.. కమల్ స్టైల్ అంటే ఇదే 


-కమల్, విజయ్ ల పరిస్థితి ఏంటి!
-అనుభవం గొప్పది
-సలహాలు ఇచ్చే స్థితిలో లేను

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan),ఇళయదళపతి విజయ్(Vijay).ఈ ఇద్దరి హవా తమిళ సిల్వర్ స్క్రీన్ తో పాటు పాన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల,ప్రేక్షకుల బలం కూడా అపారం. ప్రజలకి సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సొంతంగా పొలిటికల్ పార్టీలని స్థాపించి ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు.


రీసెంట్ గా విజయ్ రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడుతు 'విజయ్ నాకు సోదరుడు లాంటి వ్యక్తి. రాజకీయ పరంగా విజయ్‌కి సలహా ఇచ్చేందుకు ఇది సరైన సమయం కాదు. విజయ్‌ కి సలహా ఇచ్చే స్థితిలో కూడా లేను. అనుభవం మన కన్నా గొప్ప గురువు. అది నేర్పే పాఠాలు ఎవరు నేర్పించలేరు. మనుషులకి పక్షపాతం ఉండొచ్చు గానీ అనుభవానికి ఉండదు అంటు మరో సారి తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు.

also read: వైభవంగా జరిగిన సమంత పెళ్లి.. వరుడు రాజ్ నిడమోరు


ఇరువురి రాజకీయ జీవితాన్ని ఒకసారి చూసుకుంటే కమల్ ప్రస్తుత అధికార పార్టీ ''డిఎంకె'(DMK)మద్దతుతో తన 'మక్కల్ నీది మయ్యం పార్టీ'(Makkal Needi Mayyam)నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్,'డిఎంకె' కి పొత్తు ఉండటం ఖాయం. విజయ్ తన 'తమిళగ వెట్రీ కజగం'(Tamilaga vettri Kazhagam)పార్టీ నుంచి ఒంటరిగా పోటీ చేయనున్నాడు. ఇప్పటికే డిఏంకె తన ప్రత్యర్థి అని బహిరంగంగానే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో విజయ్ పై కమల్ చేసిన కామెంట్స్ వైరల్ గా నిలిచాయి. సినిమాల పరంగా చూసుకుంటే విజయ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న వరల్డ్ వైడ్ గా 'జననాయగన్' తో అడుగుపెట్టనున్నాడు. కమల్ మాత్రం హీరోగా ఎలాంటి సినిమాని అనౌన్స్ చెయ్యలేదు. నిర్మాతగా రజనీకాంత్ తో ఒక సినిమాని నిర్మిస్తున్నాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.