English | Telugu

ప్ర‌భాస్‌తో ర‌ణ్‌వీర్ సింగ్ న‌యా అగ్రిమెంట్‌!

ప్ర‌భాస్ ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్‌. అందుకే ర‌క‌ర‌కాల ఇండ‌స్ట్రీల నుంచి ఆయ‌న‌తో కొలాబ‌రేష‌న్ కోసం క్యూ క‌డుతున్నారు స్టార్స్ . లేటెస్ట్ గా ఈ లైన్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ క‌నిపిస్తున్నారు. ప్ర‌భాస్‌తో క‌లిసి థియేట‌ర్ల‌లోకి రావ‌డానికి రెడీ అవుతున్నారు ర‌ణ్‌వీర్ సింగ్‌. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య క‌నిపిస్తున్న రిలేష‌న్‌షిప్ ప్ర‌స్తుతానికి ఫ్రెండ్లీగా లేదు. పోటాపోటీగా ఉండేలా క‌నిపిస్తోంది.

కేజీయ‌ఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైర‌క్ష‌న్‌లో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా స‌లార్‌. ఈరోజు(జులై 6న) ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. సేమ్ డే ర‌ణ్‌వీర్ సింగ్ డాన్‌3 టీజ‌ర్ కూడా రిలీజ్ కానుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అఫిషియ‌ల్ కన్ఫ‌ర్మేష‌న్ ఇంకా రాలేదు. హోంబ‌లే ఫిల్మ్స్ తెర‌కెక్కిస్తున్న స‌లార్‌కి ఎంత క్రేజ్ ఉందో, డాన్ ఫ్రాంఛైజీల‌కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది.

డాన్‌3 చిత్రానికి ఫ‌ర్హాన్ అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. షారుఖ్ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో అవ‌కాశం ర‌ణ్‌వీర్ సింగ్‌కి వ‌చ్చింది. గ‌త కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు ర‌ణ్‌వీర్‌సింగ్‌. ఆలియాతో క‌లిసి ఆయ‌న న‌టించిన రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హానీ ఈ నెల్లోనే విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం నార్త్ జ‌నాలు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. చాన్నాళ్ల త‌ర్వాత క‌ర‌ణ్ జోహార్ డైర‌క్ట్ చేసిన సినిమా ఇది.