English | Telugu
మ్యాజిక్ రిపీట్ కాదంటున్న కాజోల్!
Updated : Jul 9, 2023
తన గత చిత్రాల మ్యాజిక్ గురించి మాట్లాడారు నటి కాజోల్. క్లాసిక్ సాంగ్స్‌ని, ఐకానిక్ మూవీస్‌ని రీక్రియేట్ చేసినా, పాత మ్యాజిక్ మళ్లీ పునరావృతం కాదని అంటున్నారు నటి కాజోల్. ఆమె ఇటీవల లస్ట్ స్టోరీస్-2 లో కనిపించారు. ఈ సందర్భంగా ఓ నార్త్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
"కాలం చాలా మారింది. కాలానుగుణంగా అన్ని విషయాల్లోనూ మార్పులు వచ్చాయి. దిల్‌వాలే దుల్హనియా మాత్రమే కాదు, నా కెరీర్‌లో నేను చేసిన ప్రతి సినిమాకూ ఓ స్పెషాలిటీ ఉంది. ఆ సమయంలో అద్భుతమైన అంశాలతో చేశాం. ఇప్పుడు ఆ మ్యాజిక్ రీక్రియేట్ కాదు. చేసినా కృతకంగా అనిపిస్తుంది" అని అన్నారు.
దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగేలో ఆమె నటించిన సిమ్రన్ పాత్రను గుర్తుచేసుకున్నారు నటి కాజోల్. "నేను ఇప్పటికీ సిమ్రన్ కేరక్టర్ గురించి ఊహించుకుంటూ ఉంటాను. ఆమె లండన్‌లో రాజ్‌తో స్థిరపడి ఉంటే 20 ఏళ్లు దాటేది. సిమ్రన్ చాలా మారిపోయి ఉండేది. ఆ మార్పు ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుంటుంటే సరదాగా అనిపిస్తుంది" అని అన్నారు.
ముంబైలోని మరాఠా మందిర్‌లో దాదాపు 20 ఏళ్లకు పైగా ఈ సినిమాను ప్రదర్శించారు. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. సిమ్రన్ కేరక్టర్ గురించి కాజోల్ చెప్పిన ఇమాజినేషన్ విన్నవాళ్లందరూ వారెవా నిజమే కదా అని అనుకుంటున్నారు.
లస్ట్ స్టోరీస్ 2తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు కాజోల్. ఆమె తదుపరి వెంచ్ లీగల్ డ్రామా. ది ట్రయల్: ప్యార్ కానూన్ దోఖాలో నటించనున్నారు. అమెరికన్ డ్రామా సీరీస్ ది గుడ్ వైఫ్ ఆధారంగా తెరకెక్కుతోంది ఇది.
మరోవైపు ఇటీవల కుమార్తెతో కలిసి కాజోల్ తీసుకున్న ఫొటోలు నెట్టింట్లో ఫైర్ పుట్టించాయి.