English | Telugu
యానిమల్‌కి ఆ హీరో సైడ్ ఇవ్వలేదు!
Updated : Jul 4, 2023
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా యానిమల్. రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి, బాబీ డియోల్ నటిస్తున్నారు. గత నెల్లో ఈ సినిమా ప్రీ టీజర్ విడుదలైంది. అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో ఆగస్టు 11న విడుదల కానున్న సినిమా కోసం జనాలు ఎదురుచూడసాగారు. అయితే, యానిమల్ రిలీజ్ డేట్ వాయిదాపడినట్టు వార్తలొచ్చాయి. ఈ విషయాన్నిడైరక్టర్ సందీప్‌రెడ్డి వంగా కన్‌ఫర్మ్ చేశారు. ``ప్రతి వెర్షన్‌లోనూ ఏడు పాటలుంటాయి. ఐదు భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఏడైదుల ముప్పై ఐదు. అన్ని పాటలు ఆయా భాషల్లో క్వాలిటీగా రావాలంటే టైమ్ కావాల్సిందే. ముందు దీని గురించి సరైన అవగాహన లేకపోవడంతో రిలీజ్ డేట్ ఇచ్చేశాం. కానీ క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాక తప్పడం లేదు. డిసెంబర్ 1న సినిమాను విడుదల చేస్తాం`` అని ప్రకటించారు.
డిసెంబర్ 1 అని సందీప్ ప్రకటించగానే, ఆ డేట్‌లో వచ్చే మిగిలిన సినిమాల మీద నజర్ పడింది మూవీ గోయర్స్ కి. ఆ రోజు శ్యామ్ బహదూర్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. అసలు శ్యామ్ బహదూర్ అదే రోజు రిలీజ్ అవుతుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అలాంటివేమీ పెట్టుకోవద్దు. మేం చెప్పిన డేట్‌కే వస్తున్నామని ప్రకటించారు మేకర్స్. రోనీ స్క్రూవాలా మాట్లాడుతూ ``మా సినిమా డేట్‌ని మేం ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ 1న విడుదలచేస్తాం. తన దేశం కోసం పాటుపడ్డ అత్యుత్తమమైన వ్యక్తి గురించి మేం చెబుతున్నాం. ఆడియన్స సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. కంటెంట్ ఈజ్ ఆల్వేజ్ కింగ్. ఇక, ఫ్రైడే ఓపెనింగ్స్ అంటారా... ఆడియన్స్ చాలా తెలివైన వారు. ఏ సినిమా చూడాలో వారు నిర్ణయించుకుంటారు`` అని అన్నారు.