English | Telugu
కార్తీక్ సినిమాలో శ్రద్ధ నాయిక!
Updated : Jul 6, 2023
కార్తీక్ ఆర్యన్ హీరోగా 'చందు ఛాంపియన్' అనే సినిమా తెరకెక్కనుంది. టైటిల్‌ని బట్టే యూనిక్ స్పోర్ట్స్ డ్రామా అనే విషయం అర్థమవుతోంది. సత్యప్రేమ్ కీ కథ హీరో ఇప్పుడు మంచి జోష్ మీదున్నారు. అదే జోరుతో నెక్స్ట్ ప్రాజెక్టుల్ని సిద్ధం చేస్తున్నారు. ఆయన నటించే చందు ఛాంపియన్ సినిమాను కబీర్ ఖాన్, షాజిద్ నదియడ్‌వాలా కలిసి తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో నాయికగా శ్రద్ధాకపూర్‌ని అనుకుంటున్నట్టు టాక్.
షాజిద్, కబీర్ మంచి హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. శ్రద్ధ కపూర్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఫైనల్ చేశారు. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆనందంగా ఉంది. త్వరలోనే అగ్రిమెంట్ మీద సంతకం చేస్తారని టాక్. కార్తిక్, శ్రద్ధ ఇంతకు ముందు ఏ సినిమాకూ కలిసి పనిచేయలేదు. అయితే ఇటీవల విడుదలైన తూ జూతీ మే మక్కర్‌లో కార్తీక్ కేమియో రోల్ చేశారు. అందులో శ్రద్ధ హీరోయిన్‌గా నటించారు.
చందు ఛాంపియన్ చూడ్డానికి స్పోర్ట్స్ డ్రామాలాగా అనిపించినప్పటికీ, అందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మంచి ఎలిమెంట్స్ కి స్కోప్ ఉంది. వీయఫ్‌యక్స్ కి కూడా మంచి స్కోప్ ఉందని అంటోంది బాలీవుడ్ మీడియా. తప్పకుండా ఈ సినిమాకు పనిచేసే ప్రతి ఒక్కరి కెరీర్‌లోనూ ల్యాండ్‌మార్క్ సినిమాగా మిగులుతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 14న థియేటర్లలో విడుదల చేస్తారు.