English | Telugu
షారుఖ్‌కి సర్జరీ... దిగులుపడుతున్న ఫ్యాన్స్!
Updated : Jul 4, 2023
సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ అభిమానులను మంగళవారం ఉదయం ఓ వార్త కలత చెందేలా చేసింది. యుఎస్‌లో షూటింగ్‌లో ఉన్న షారుఖ్ గాయపడ్డారన్నది ఆ వార్త సారాంశం. ఆయన అప్‌కమింగ్ మూవీ షూటింగ్ కోసం యుఎస్‌లో ఉన్నారు. అక్కడ రౌండ్స్ చేస్తుండగా సెట్లో ప్రమాదం జరిగింది. షారుఖ్‌కి గాయాలయ్యాయి. ముఖ్యంగా ముక్కుకి బాగా దెబ్బతగిలింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్తే వైద్యులు ముక్కుకు శస్త్రచికిత్స చేశారు. షారుఖ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు గెట్‌వెల్ సూన్ మెసేజ్‌లు పంపుతున్నారు. అభిమానుల ప్రార్థనలు ఎప్పుడూ ఆయనతో ఉంటాయి. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఓ ఫ్యాన్ రాశారు. దిగులుపడకండి గైస్, అది చిన్న ప్రమాదమే. మన జవాన్ ఇప్పుడు ఫిట్‌గా, బావున్నారు అని రాసుకొచ్చారు. ఆయనకు ఏం కాదు, ఆయన లెజెండ్, సూపర్ పవర్ ఉన్న వ్యక్తి అని మరో అభిమాని పోస్ట్ చేశారు.
షారుఖ్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జవాన్. ఈ సినిమా ట్రైలర్‌ని టామ్ క్రూయిజ్ మిషన్ ఇంపాజుబుల్7తో పాటు రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. జులై 12న జవాన్ ట్రైలర్, థియేటర్లలో జనాలను పలకరించడానికి రెడీ అవుతోంది. సాన్య మల్హోత్రా ఇందులో కీ రోల్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7న విడుదల కానుంది జవాన్. ఈ సినిమా తర్వాత డంకీలో నటిస్తారు షారుఖ్. రాజ్‌కుమార్ హిరానీ డైరక్షన్‌లో తెరకెక్కుతుంది. తాప్సీ అందులో నాయిక. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది డంకీ.