English | Telugu
వేలంటైన్స్ డే మీద ఖర్చీఫ్ వేసిన సూర్య
Updated : Jul 7, 2023
'సూరరైపోట్రు' సినిమా కోసం నేషనల్ అవార్డు అందుకున్న హీరో సూర్య. ఇటీవల ఆయన నటించిన 'జై భీమ్' కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం విజువల్ ఫీస్ట్ అందించే 'కంగువా' సినిమాలో నటిస్తున్నారు. సిరితై శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరికొన్ని నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మరోవైపు ఆయన నిర్మాతగా 'సూరరైపోట్రు' హిందీ రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ కి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ అక్కడ లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనతోపాటు రాధిక మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ చేస్తున్నారన్నది సమాచారం. ఈ సందర్భంగా అక్షయ్‌తో ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 16వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఇవ్వనున్నారు. దాంతోపాటు హిందీలో ఈ సినిమాకు ఏం టైటిల్ పెట్టారు, ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారు, ఆడియో లాంచ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాలన్నిటిని షేర్ చేసుకోబోతున్నారు.
జాతీయ అవార్డుల్లో ఐదు కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది సూరరైపోట్రు. బెస్ట్ యాక్టర్ గా సూర్య, బెస్ట్ యాక్ట్రెస్ గా అపర్ణ బాలముర ళి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా జీవి ప్రకాష్ కుమార్, బెస్ట్ సినిమాకుగానూ సూర్య, జ్యోతిక కలిసి ఈ అవార్డు అందుకున్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లేకు గాను సుధా కొంగర కూడా అవార్డు అందుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వాలెంటెన్స్ డే సందర్భంగా నార్త్ లో హల్చల్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల తన బేస్‌ని చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ చేశారు సూర్య. హిందీ సినిమాల మీద ఆయన కాన్సన్ట్రేషన్ పెరుగుతోంది అంటోంది కోలీవుడ్. వరుసగా హిందీ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తూ, గెస్ట్ రోల్స్ చేస్తూ, సినిమాలు నిర్మిస్తూ ఉత్తరాదిన తన హవా చూపించడానికి రెడీ అవుతున్నారు సూర్య. జ్యోతిక వెనకుండి ఈ మొత్తం పనులు నిర్వహిస్తున్నారు అన్నది ఇన్సైడ్ టాక్.