English | Telugu

వైన్ గ్లాస్..లిప్ లాక్...హాట్ గా గుప్పెడంతమనసు జగతి మేడం


గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్ జగతి వరుసగా సినిమాలు చేసేస్తూ వస్తోంది. ఈ సీరియల్ లో రిషి సర్ కి మదర్ రోల్ పూర్తైపోయి బయటికి వచ్చేసాక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా హాట్ గా హల్చల్ చేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ కి సైన్ చేసేస్తూ అందం ఉండగానే అకౌంట్స్ నిండుగా డబ్బులు దాచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో "నో మరి సీక్రెట్స్" అంటూ ఒక హాట్ వెబ్ సిరీస్ కి సంబందించిన న్యూస్ ని , పోస్టర్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ లో బీచ్ ఒడ్డున చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని హీరోకి లిప్ కిస్ ఇస్తూ కనిపించింది అమ్మడు. "నో మోర్ సీక్రెట్స్ వెబ్ సిరీస్‌లో నా ఫస్ట్ లుక్ ని ఇలా షేర్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సిరీస్ తెలుగు, హిందీ భాషల్లో రాబోతోంది. ఈ అవకాశం ఇచ్చిన పార్థు సార్‌కి థ్యాంక్స్. ఈ సూపర్ వెబ్ సిరీస్‌లో నాకు ఫిమేల్ లీడ్‌గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సిరీస్ కి సంబంధించిన మిగతా అప్‌డేట్స్ త్వరలో చెబుతాను." అంటూ టాగ్ లైన్ పెట్టింది జగతి మేడం.

బుల్లితెర నుంచి వెండితెర పై ఓ వెలుగు వెలిగేసి కావాల్సినంత సంపాదించుకుని పక్కన పడేసుకుంటే ఆ తర్వాత ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనే ప్లాన్ లో ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం 'ఏ మాస్టర్ పీస్', 'ప్రెట్టీ గర్ల్' "అండర్ వరల్డ్ బిలియనీర్స్" అనే వెబ్ సిరీస్ లో చేస్తున్న జగతి " నో మోర్ సీక్రెట్స్ ' అంటూ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేసింది. ఈ మధ్య జగతి మేడం ఎక్స్పోజింగ్ శృతి మించి సోషల్ మీడియాని షాక్ చేసేస్తోంది. చిన్న గౌన్ వేసుకున్న పెద్ద పాపా అనే పాటలోలా హాట్ ఫోటోషూట్స్ ని చేసేసి ఇన్స్టాగ్రామ్ లో పడేస్తోంది. మరిన్ని ఛాన్సెస్ కోసం ఎదురుచూస్తోంది జగతి మేడం.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..