English | Telugu

రీఎంట్రీ ఇచ్చిన మనో..కామెడీ క్వాలిటీ బాలేదు

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ ఐన మొదట్లో చాల ఎంటర్టైనింగ్ గా ఫుల్ కామెడీ డైలాగ్స్ తో ఇంటిల్లిపాదీ చూసేలా ఉండేది. కానీ రాను రాను ఈ షోస్ కి పిల్లర్స్ లా ఉన్న సీనియర్ కమెడియన్స్ అంతా వెళ్లిపోయారు. కొత్త వాళ్ళు వచ్చారు. ఐతే కొంత కాలం నుంచి ఈ షోకి కమెడియన్స్ తో పాటు జడ్జెస్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. దాంతో ఈ షోస్ కి వున్న రేటింగ్, క్వాలిటీ కామెడీ ఇండెక్స్ తగ్గిపోతూ వస్తోంది.

జబర్దస్త్ అంటే జడ్జెస్ ప్లేస్‌లో రోజా, నాగబాబు పడీపడీ నవ్వుతూ పంచులు వేస్తూ, సలహాలు, సూచనలు ఇస్తూ కమెడియన్స్ పాటు కలిసి పోయి జోక్స్ వేస్తూ చాల సందడిగా, సరదాగా ఉండేది షో. కానీ రోజా మంత్రి కావడంతో జబర్దస్త్‌కి గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోయారు. తర్వాత నాగబాబు కూడా చిన్నచిన్న ఇష్యూస్ కి బైబై చెప్పేసి వెళ్లిపోయారు..తిరిగి రాను అని చెప్పేసారు. తర్వాత వాళ్ళ ప్లేసెస్ ని రీప్లేస్ చేసేందుకు జబర్దస్త్ టీమ్ చాలా ప్రయత్నాలు చేసింది.

తర్వాత నాగబాబు కొంతకాలం సీట్ లో కనిపించారు ఆ తర్వాత మళ్ళీ వేరే షోస్ కి జడ్జిగా అవకాశం వచ్చేసరికి వెళ్లిపోయారు. ఇక ఫైనల్ గా కృష్ణ భగవాన్, ఇంద్రజ హాట్ సీట్స్ లో సెట్ ఇపోయారు. అయితే ఇటు జబర్దస్త్, అటు ఎక్స్‌ట్రా జబర్దస్త్ రెండూ షోలను మేనేజ్ చేయడం కష్టంగా ఉండటంతో కొద్ది కాలం ఖుష్భూ కూడా జడ్జిగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మరోసారి జడ్జి మారిపోయారు. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత రోజాతో పాటు ఆ ప్లేస్‌లో జడ్జిగా ఉన్న సింగర్ మనో ఇప్పుడు మరోసారి జబర్దస్త్ సెట్‌లో కనిపించారు.

ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో కృష్ణ భగవాన్‌తో పాటు మనో వచ్చారు. ఇటీవలే ఖుష్ఫూ ఈ షోకి గుడ్‌బై చెప్పడంతో ఒక ఎపిసోడ్ కి అలనాటి అందాల నటి మహేశ్వరిని జడ్జి తీసుకొచ్చారు. ఇక ఈ వారం మనోను షోకి తిరిగి రప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఇక లేడీ జడ్జి ఉండరు అనే విషయం అర్ధమవుతోంది. జబర్దస్త్‌కి మాత్రం ఇంద్రజ, కృష్ణ భగవాన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ షోస్ ఆగిపోతాయి కామెడీ లేదు అంటూ కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తోంది. మరి ఈ రెండు షోస్ సంగతి ఏమో కానీ నెటిజన్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలను కామెంట్స్ చేస్తున్నారు. "కామెంట్స్ తగ్గిపోయాయి , లైక్ లు తగ్గిపోయాయి, వ్యూస్ తగ్గిపోయాయి...ఇవన్నీ పెరగాలి అంటే సుడిగాలి సుదీర్.. హైపర్ ఆది రావాలి.... అప్పుడు బాగుంటుంది షో ... జబర్దస్త్ రేటింగ్ చాలా పడిపోయింది పాతవారిని మళ్లీ తీసుకురండి..." అని ఎక్స్ట్రా జబర్దస్త్ మేకర్స్ ని అడుగుతున్నారు. మరి వాళ్ళు ఎం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.