English | Telugu
శ్రీరామాచంద్ర ఇక్కడ సింగర్ గా రాణించాడు..అక్కడ డాన్సర్ గా అదరగొడుతున్నాడు
Updated : Dec 15, 2023
శ్రీరామాచంద్ర సింగర్ గానే మనకు ఇంత వరకు తెలుసు. కానీ ఇప్పుడు డాన్సర్ గా అవతారం ఎత్తి ఇరగదీసేస్తున్నాడు. సోనీలో ప్రసారమవుతున్న ఝలక్ దికలాజా డాన్స్ షోలో కో-డాన్సర్ సోనాలితో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇక శ్రీరామచంద్ర చేస్తున్న ఈ డాన్స్ పిక్ ని వరుణ్ సందేశ్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. "శ్రీరామచంద్ర తన డాషింగ్ స్టెప్స్ తో జడ్జెస్ ని బాగా ఇంప్రెస్స్ చేసాడు" అంటూ కాప్షన్ కూడా పెట్టాడు వరుణ్ సందేశ్.
ఇండియన్ ఐడల్ సీజన్ 5 టైటిల్ విజేత మన శ్రీరామచంద్ర. శ్రీరామ చంద్ర ప్లేబ్యాక్ సింగర్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసాడు అలాగే 2007లో నోట్ బుక్ అనే మూవీలో ఒక సాంగ్ పాడాడు. ఇండియన్ ఐడల్ విన్ అయ్యాక సింగర్ శ్రీరామ చంద్ర మొదటి హిందీ ఆల్బమ్ - రెహ్నుమా 2010లో విడుదలైంది. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్ , సునిధి చౌహాన్ వంటి ప్రఖ్యాత గాయకులతో కలిసి ప్రదర్శన ఇచ్చాడు. 2013 నుండి శ్రీరామచంద్ర నటన వైపుకు అడుగులు వేసాడు. తెలుగులో 'జగద్గురు ఆది శంకర' అనే మూవీలో నటించాడు.
తర్వాత 2014 లో "ప్రేమ గీమ జాన్తా నై" మూవీ ద్వారా హీరోగా అరంగేట్రం చేసాడు. అక్కడ పెద్దగా క్లిక్ కాలేదు శ్రీరామచంద్ర. ఇక తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్ వెళ్లి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి చివరికి సీజన్‌లో సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తర్వాత ఓటిటి ప్లాటుఫారం మీదకు అడుగుపెట్టాడు ఈ సింగర్.. తెలుగు ఇండియన్ ఐడల్‌కి హోస్ట్‌గా చేసాడు. అలాగే ఇప్పడు "పాపం పసివాడు" వెబ్ సిరీస్ లో నటించాడు. ఇక డాన్సర్ గా కూడా తనదైన ముద్రను వేసుకుంటూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఝలక్ దికలాజా సీజన్ 11 లో మనోడు మెరిసి దూసుకుపోతున్నాడు. ఇక ఈ షోకి మలైకా అరోరా, ఫరా ఖాన్, అర్షద్ వార్సీ న్యాయనిర్ణేతలుగా ఉన్నారు.