English | Telugu
Guppedantha Manasu:రిషిని కిడ్నాప్ చేసింది శైలేంద్రేనని తెలుసుకున్న అనుపమ !
Updated : Dec 15, 2023
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -946 లో.. ధరణి వచ్చి శైలేంద్ర చేసిన కుట్రల గురించి వసుధార, మహేంద్రలకి చెప్తుంది. ఆ తర్వాత శైలేంద్ర దగ్గరికి వసుధార వచ్చి.. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతుంది. ఇలా కాదు బెగ్గింగ్ చెయ్యాలి, అప్పుడు చెప్తాను రిషి ఎక్కడ ఉన్నాడో అని వసుధారతో శైలేంద్ర క్రూరంగా మాట్లాడుతాడు. అయిన రిషి కోసం వసుధార తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని శైలేంద్రని రిక్వెస్ట్ చేస్తుంది. ఎంత రిక్వెస్ట్ చేసిన శైలేంద్ర తన విలనిజాన్ని చూపిస్తూ రిషి గురించి చెప్పడు.
ఆ తర్వాత రిషి క్షేమంగా ఇంటికి రావాలంటే.. నువ్వు ఎండీ సీట్ నాకు ఇవ్వాలని శైలేంద్ర అంటాడు. అది కుదరదని వసుధార చెప్తుంది. అయినా శైలేంద్ర కోపంగా.. నువ్వు నాకు ఎండీ చైర్ ఇస్తేనే రిషి ఇంటికి వస్తాడని చెప్తాడు. ఆ తర్వాత రిషి నీకు క్షేమంగా ఇంటికి రావాలా? ఎండీ చైర్ కావాలా? బాగా అలోచించి చెప్పమని వసుధారతో శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార ఏం చెయ్యలేక అక్కడ నుండి ఏడుస్తూ ఇంటికి బయలుదేరుతుంది. ఆ తర్వాత వసుధార ఇంటికి డల్ గా రావడం చుసిన మహేంద్ర.. ఏమైంది అలా ఉన్నావని అడుగుతాడు. నేను ఎండీగా ఉండలేను మామయ్య. నాకు రిషి సర్ కావాలని వసుధార అనగానే.. అక్కడే ఉన్న అనుపమ, మహేంద్ర ఇద్దరు అసలు ఏమైందని అంటారు. ఇక వసుధార జరిగింది మొత్తం వాళ్ళకి చెప్తుంది.
ఆ తర్వాత రిషిని శైలేంద్ర కిడ్నాప్ చేసాడా అంటూ మహేంద్ర కోపంగా ఉంటాడు. మరొకవైపు ధరణిని శైలేంద్ర పిలిచి.. నీకు వసుధార ఎక్కడ కలిసింది. తనకి నిజం చెప్పావా అని శైలేంద్ర అడుగుతాడు. అప్పుడు ధరణి నేనేం చెప్పలేదంటూ చాలా తెలివిగా సమాధానం చెప్తుంది. అప్పుడే దేవయాని వస్తుంది. ధరణి వెళ్ళిపోతుంది. రిషి నీ దగ్గరే ఉన్నాడా అని దేవయాని అడుగుతుంది. నేనే కిడ్నాప్ చేయించానని శైలేంద్ర చెప్పి.. వసుధారతో చెప్పిన మాటలు కూడా చెప్తాడు. మరొకవైపు రిషి గురించి వసుధార బాధపడుతుంటే అనుపమ వచ్చి.. వసుధారకి ధైర్యం చెప్తుంది. మీ ఇద్దరిని ఎలాగైనా నేను ఒకటి చేస్తానని అనుపమ అంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..