English | Telugu

ఆదికి జాతక దోషం..ముసలావిడను పెళ్లి చేసుకోమంటూ బాబా సలహా


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో హైపర్ ఆది పెళ్లి తిప్పలు కాన్సెప్ట్ తో ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి అందంగా ముస్తాబై రాబోతోంది. హైపర్‌ ఆదికి నలభై ఏళ్లు దాటినా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. వాళ్ళను వీళ్ళను చూపించి పెళ్లి చేసుకుంటాను అంటాడు కానీ ఆ పెళ్లి ఊసే ఎత్తడు. మరి వెళ్లేందుకు చేసుకోవడం అని ఆరా తీస్తే ఆయన జాతకంలో దోషం ఉందని తెలిసి ఒక బాబాను ఆశ్రయించాడు.

ఆ బాబా ఎవరో కాదు తాగుబోతు రమేష్. ఇక ఆ బాబా హైపర్ ఆది చేతి రేఖలు చూసి కుజ దోషం పోవాలంటే ముందుగా ఒక వృద్ధురాలిని పెళ్లి చేసుకున్నాక మళ్లీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. ఇక హైపర్ ఆదికి స్వయంవరం జరుగుతుంది. కొంతమంది ముసలి వాళ్ళు వచ్చారు. మొదట వచ్చిన ఆమె బాగానే ఉన్నా వద్దని చెప్తాడు ..ఇక రెండో ముసలావిడ వచ్చి హైపర్ ఆది వద్దు అంటూ ఒక పాట రూపంలో పాడి వినిపిస్తుంది.

ఇక తర్వాత ముగ్గురు మహిళలు వచ్చి `కోట బొమ్మాళి` మూవీలోని `లింగిడి లింగిడి` సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేశారు. అయితే వారి డాన్సులకు ఫిదా అయిన హైపర్‌ ఆది.. అందులో ఒక ముసలామెకు కనెక్ట్ అయ్యి ఓకే చెప్పాడు. తీరా చూస్తే లేడీ గెటప్ లో ఉన్న ఒక మేల్ డాన్సర్ . ఇక అతని నెత్తి మీద ఉన్న లేడీ విగ్ తీసేసరికి ఆది, రష్మీ షాకైపోయారు. ఇందులో రష్మి, ఇంద్రజ పై ఆది పంచ్‌లు పీక్స్ లో ఉన్నాయి. ఇక పాపం ఎప్పటికప్పుడు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆదికి ఇక్కడ కూడా నిరాశే ఎదురయ్యింది. మరి ఇంకా ఎప్పటికి పెళ్లయేనో..ఇక ఆది స్కిట్ చూసిన నెటిజన్స్ అంతా కూడా ఆది కామెడీ లేనిదే శ్రీదేవి డ్రామా కంపెనీ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.