English | Telugu

ఇలాంటి స్టెప్స్ ప్రభుదేవా కూడా వేయలేడు...

ఆలీతో ఆల్ ఇన్ వన్ షో ప్రతీ వారం ఫుల్ కామెడీగా నవ్వు తెప్పిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి మహేష్ ఆచంట, అనన్య, విశ్వా వచ్చారు. ఇక "ధూమ్ ధామ్ దోస్తాన్" సాంగ్ కి మహేష్ ఆచంట నాన్ సింక్ స్టెప్పులేసేసరికి ఆలీ షాకైపోయి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయారు.

"నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్న నువ్వు వేసిన స్టెప్పు ప్రభుదేవా కూడా వేయలేరు" అంటూ కితాబిచ్చారు. తర్వాత స్టేజి మీదకు అనన్య వచ్చింది. "నాలాగే నీకు కూడా నవ్వితే బుగ్గల మీద సొట్టలు పడుతున్నాయి" అని అలీ అనేసరికి "ఒక బుగ్గాకే పడుతుంది" అని అనన్య చెప్పేసరికి "రెండు బుగ్గలకు సొట్టలు పడే అబ్బాయిని వెతుక్కో" అని ఆలీ కౌంటర్ వేసేసరికి "మీరున్నారు కదా సర్" అంటూ ఆలీకి అద్దిరిపోయే పంచె వేసింది అనన్య. ఇక తర్వాత విశ్వా చాల స్టైలిష్ గా కళ్ళజోడు పెట్టుకుని మరీ డాన్స్ చేస్తూ వచ్చాడు. " ఏమిటి ఈ కళ్ళజోడు ..స్టైలా " అని ఆలీ అడిగారు.

"కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని" అన్నాడు విశ్వా "అంటే దూరంగా ఉన్నవాళ్ళెవరూ కనిపించారా" అని మళ్ళీ కౌంటర్ వేసాడు ఆలీ. "బాగా దగ్గరగా కనిపిస్తారన్న" అంటూ పంచ్ ఇచ్చాడు విశ్వా. తర్వాత పవిత్ర వచ్చి అనన్యను చూసి "జస్ట్ లూకింగ్ లైక్ ఏ వావ్" అనే గట్టిగా గాండ్రించేసరికి మహేష్ కూడా "గౌడగేదె గాండ్రించినట్టుంది" అంటూ పవిత్ర పై కామెంట్ చేసాడు. ఇక ఈ ముగ్గురు కూడా బుల్లితెర మీద షోస్ లో, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. అనన్య కొన్ని మూవీస్ లో నటించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.