English | Telugu

కొత్త వ్లాగ్స్ తో ప్రియాంక, శోభాశెట్టి.. ఇకమీదట సీరియల్ ఆఫర్స్ కష్టమేనా!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో సీరియల్ బ్యాచ్ కి ఉండే ప్రత్యేకతే వేరు. ఎందుకంటే వారెన్ని ఫౌల్స్ చేసిన బిగ్ బాస్ వాళ్ళకే సపోర్ట్ చేసేవాడు. ప్రియాంక, శోభాశెట్టి, అమర్ దీప్ ఎన్ని ఫాల్స్ చేసినా, వారు నామినేషన్ లో‌ లీస్ట్ లో ఉన్నా వారిని ఎలిమినేషన్ చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే శోభాశెట్టి, ప్రియాంకలని అన్ని వారాలు హౌస్ లో ఉంచినందుకు చాలామంది బిగ్ బాస్ అభిమానులు తెగ ట్రోల్స్ చేశారు.‌ అయితే బిగ్ బాస్ హౌస్‌ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూ మారిపోతుంది.

తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. రియల్ లైఫ్‌‌లో వాళ్ల వ్యక్తిత్వం ఏంటనేది బయటకు తెలిసిపోయిన తరువాత ఆయా పాత్రలకు పూర్తి న్యాయం చేయలేరు. జీవం పోయలేరు. నిజానికి వాళ్ల నటనలో ఎలాంటి తేడా ఉండదు కానీ.. చూసే ఆడియన్స్‌ మాత్రం వాళ్లని రిసీవ్ చేసుకోలేరు. బిగ్ బాస్‌కి వెళ్లొచ్చిన నటీనటీలకు సరైన అవకాశాలు రావకపోవడానికి ప్రధాన కారణం ఇదే. వాళ్ల రియల్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిన తరువాత.. వాళ్ల రియాలిటీకి దగ్గరగా ఉండే పాత్రల్లో మాత్రమే మెప్పించగలరు. కాదని కొత్త పాత్రలు ఇస్తే వాళ్ల వ్యక్తిత్వానికి పూర్తి అపోజిట్‌గా ఉండే పాత్రల్ని క్రియేట్ చేస్తే అవి ఖచ్చితంగా బెడిసికొడతాయి. కాబట్టే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ఏదైన సినిమాలో‌ ఛాన్స్ ఇవ్వాలంటే దర్శక నిర్మాతలు అంతలా ఆలోచిస్తుంటారు. వీళ్లని జనం మొత్తం చదివేశారు. వీళ్లని మనం ఎలా చూపించినా మెప్పించలేం. ఎందుకుంటే వాళ్లేంటో జనానికి తెలుసు కాబట్టి కొత్త వాళ్లే బెటర్ అని వేరే ఆప్షన్‌కి వెళ్లిపోతుంటారు.

శోభాశెట్టి కెరియర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమెకు అవకాశాలు లేవు.. దానికి తోడు ఇప్పుడు బిగ్ బాస్ తరువాత.. ఆమె నిజస్వరూపం ఏంటన్నది బిగ్ బాస్ బయటపెట్టేశాడు కాబట్టి ఇక ఆమె చేస్తే తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే నెగిటివ్ పాత్రలే చేసుకోవాలి తప్పితే మంచి పాత్రలు వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు. దీంతో శోభాశెట్టికి ఇక్కడ తెలుగులో నటించే అవకాశాలు కన్పించడం లేదు. తిరిగి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళడం తప్పితే మరో దారి కనిపించడం లేదు. శోభాశెట్టితో పాటుగా ప్రియాంక పరిస్థితి కూడా అంతేలా ఉంది. ఆమె రియల్ క్యారెక్టర్ ఏంటో తెలియనప్పుడు.. ‘మౌనరాగం’లో అమ్ములుగా.. జానకి కలగనలేదులో జానకిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. కానీ బిగ్ బాస్‌లో ఆమె ఒరిజినాలిటీ ఏంటో అందరికి తెలిసిపోయింది కాబట్టి గతంలో మాదిరిగా.. జానకి, అమ్ములుగా కనిపించడం అయితే కష్టమే. కాబట్టి బిగ్ బాస్‌లో కన్నడ కంత్రీలుగా పేరొందిన శోభాశెట్టి, ప్రియాంకలు తిరిగి కన్నడ సీరియల్స్‌ వైపే అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఎలాగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఇక వాటిల్లోనే వాళ్లని చూడాల్సిన పరిస్థితి.