English | Telugu

నా ఆపరేషన్ సక్సెస్ అవడానికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు!



జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి చెప్పాల్సిన పని లేదు. వెరైటీ పంచ్ డైలాగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ చేయించుకున్నాడు. ఆరోగ్యం సరిగా లేకపోయినా తన ఫామిలీ, ఫ్రెండ్స్ సాయంతో స్టేజి మీదకు అప్పుడప్పుడూ వచ్చి కామెడీ చేసి ఆడియన్స్ ని నవ్వించేవాడు. అలాంటి ప్రసాద్ ఇప్పుడు కోలుకున్నాడు. మంచి హుషారుగా కామెడీ చేయడానికి తనను తాను ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా యూట్యూబ్ లో తన ఛానల్ లో ఒక వీడియోని పోస్ట్ చేసాడు. నెటిజన్స్ కి, ఫాన్స్ కి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చెప్పాడు.

వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్లనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నట్లు ఆనందంగా చెప్పుకొచ్చాడు. అలాగే రోజాకి, ఏపీ ప్రభుత్వానికి, జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ, ప్రత్యేకంగా నాగబాబు గారికి ధన్యవాదాలు చెప్పారు. ఈరోజు ఇలా హ్యాపీగా ఉండడానికి కారణం ప్రజా అభిమానమే అని చెప్పాడు ప్రసాద్ , అతని వైఫ్ కూడా. "ఆపరేషన్ సక్సెస్ అయ్యింది..పూర్తిగా కోలుకున్నాను..ఇక నా ఛానల్ లో ఇక నుంచి వీడియోస్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మేమిద్దరం రీల్స్ చేసేటప్పుడు చాలామంది నా ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసారు. వారందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్..ఐతే ఈ వీడియో చేయడానికి కొంత లేట్ అయ్యింది. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మెసేజ్ చేస్తే ఆ టైపు వీడియోస్ ని చేస్తాం.. ఐతే ఇలాంటి ఆపరేషన్ ని చేయించుకోవాలా.. వద్దా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. నేను కూడా ఈ ఆపరేషన్ చేయించుకోవడానికి భయం వేసి ఐదేళ్లు అలాగే ఉండిపోయాను. ఫైనాన్సియల్ గా కొంతమందికి సపోర్ట్ కూడా ఉండదు కాబట్టి ఈ ఆపరేషన్ ని చేయించుకోరు చాలా మంది.

ఇక ఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి నాలాంటి ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు భయపడకుండా ఆపరేషన్ చేయించుకోండి. దానికి సంబంధించిన డైట్ గురించి ఇంకా ఏవన్నా సలహాలు కావాలన్నా మెసేజ్ పెడితే నేనే వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడి చెప్తాను. సర్జరీ ముందు కానీ, సర్జరీ అయ్యాక కానీ డైట్ లో ఉంటేనే బాడీ సెట్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ మా ఫామిలీ మీద ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నా" అంటూ ప్రసాద్ ఆయన వైఫ్ అందరికీ చేతులు జోడించి నమస్కరించారు.