English | Telugu

బిగ్ బాస్ బ్యూటీ అశ్వినితో పాటలు పాడించిన పవన్ కళ్యాణ్!


బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అశ్విని కూడా ఒకరు అని చెప్పొచ్చు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన అశ్విని 12వ వారం వరకు హౌస్ లో కొనసాగిన సంగతి మనకు తెలిసిందే. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇంటర్వ్యూలు ఇస్తోంది అశ్విని. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చాలా విషయాలు చెప్పింది. "నాకు ఎప్పటికీ ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ (pawankalyan ) ..ఆయన ఎప్పుడూ నావాడే. ఆయన నటించిన మూవీ ఓజి (OG ) సూపర్ డూపర్ హిట్ ఐపోవాలని కోరుకుంటున్నా. దేవుడి దయతో పవన్ కళ్యాణ్ సీఎం ఐపోతేనా ..రోజూ ఆయన్ని పాలిటిక్స్ లో ఆయన్ని చూసుకోవచ్చు, స్క్రీన్ మీదన్నా చూసుకునే అవకాశం ఉంటుంది. ఆయన్ని మీట్ అయ్యే ఛాన్స్ వస్తే మాటలే రావు. ఆయనతో గబ్బర్ సింగ్ చేస్తున్నప్పుడు మూడు నెలలు ట్రావెల్ చేసాను. షూటింగ్ టైంలో ఎప్పుడైనా ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ నాతో పాటలు కూడా పాడించుకునేవారు. ఆయన తినే డ్రై ఫ్రూప్ట్స్ కూడా ఇచ్చేవారు. ఆయన చాలా ఫ్రెండ్లీ యాక్టర్ కూడా.. మనసులో ఏదీ పెట్టుకోరు. బయటకు ఓపెన్ గా చెప్పేస్తారు. చాలా డౌన్ టు ఎర్త్. ప్రస్తుతానికి నేను సింగల్.. ఐతే నాకు మంచి మనసు ఉన్న అబ్బాయి వస్తే చాలు. అతను నల్లగా ఉన్నా నాకేం పర్లేదు..నన్ను బాగా చూసుకోవాలి..ఆల్రెడీ చాలామంది ట్రై చేస్తున్నారు.. కానీ నాకు కూడా వాళ్ళు నచ్చాలి కదా...ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మేం అందరం ఫ్రెండ్స్ ఐపోయాం. పల్లవి ప్రశాంత్ టచ్ లోనే ఉన్నాడు. జనవరి ఫస్ట్ అక్క హాపీ న్యూ ఇయర్ అంటూ విష్ కూడా చేసాడు " అని చెప్పింది అశ్విని.