English | Telugu
బి -గ్రేడ్ స్టోరీస్ వస్తున్నాయి..ఫ్రెండ్స్ అంతా ఫేక్...
Updated : Jan 11, 2024
‘బిగ్ బాస్ 4’ ద్వారా ఆడియన్స్ కి పరిచయమైన అఖిల్ సార్ధక్ ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఐతే బిగ్ బాస్ హౌస్ కొంతమందికి బీభత్సంగా కలిసొచ్చేస్తుంది కానీ కొంతమందికి అస్సలు కలిసి రాదు అనడానికి అఖిల్ ఒక ఉదాహరణ. ఆయనకు హౌస్ నుంచి బయటకు వచ్చాక అవకాశాలైతే పెద్దగా రాలేదు. ఐతే త్వరలో స్టార్ట్ అయ్యే బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 కి వెళ్లాడంటూ టాక్ ఐతే వస్తోంది. ఇక అఖిల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు. " చాలా మంది నెక్స్ట్ ఏమిటి అని అడుగుతారు. అదసలు నాకు నచ్చదు.
ఆడియన్స్ నా నుంచి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవి చేయకపోవడం వలన వాళ్లంతా కొంచెం డిజప్పోయింట్ అవుతున్నారు. ఐతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మూవీ ఆఫర్స్ వచ్చాయి కానీ అవి బి -గ్రేడ్, ఫుల్ లస్ట్ స్టోరీస్ వచ్చాయి. ఐతే నా ఫామిలీ ఆడియన్స్ ఆ మూవీస్ చూడడానికి ఇష్టపడరు. నేను డబ్బు కోసం ఏ సినిమా ఐనా చేయొచ్చు.. ఇలాంటి ఒక్క సినిమా రిలీజ్ ఐతే గనక ఆ తర్వాత నుంచి అందరూ నన్ను అలాగే జడ్జి చేయడం స్టార్ట్ చేస్తారు. అలాంటి రోల్స్ మాత్రమే రావడం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మూవీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్.
కొంచెం లేట్ ఐనా పర్లేదు కానీ మంచి మూవీతో వస్తాను. నాకు దైవ భక్తి ఎక్కువ..అందుకే కేదార్నాథ్ లాంటి ప్లేసెస్ కి వెళ్తూ ఉంటాను. మన జీవితంలో వచ్చేవాళ్ళు మనకు ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పిస్తారు. కానీ ఎవరో ఎదగడం కోసం మిగతా వాళ్ళను తొక్కేయడం అనేది కరెక్ట్ కాదు. ఫ్రెండ్ షిప్ అంటే భయమేస్తోంది. వాళ్ళు ఏం పెంట పెడతారా అనే టెన్షన్ ఎక్కువయ్యింది. చిన్నప్పుడు ఉండే ఫ్రెండ్స్ బెటర్..ఇప్పటి ఫ్రెండ్ షిప్ అంతా ఫేక్.. చివరికి మనకు మనమే ఉండాలి. ఫ్రెండ్ షిప్ లో గ్రాంటెడ్ నెస్ ఎక్కువైపోయింది. వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేసిన, వాళ్ళు నా ఫ్రెండ్ అని చెప్పినా నెక్స్ట్ మినిట్ వాళ్ళు మనల్ని ఏం చేస్తారో అనే భయం ఉండిపోయింది. మోనాల్ కి ఫోన్ చేసి ఇలా ఇంటర్వ్యూలో ఫ్రెండ్ పేరు చెప్పామన్నారు ఎవరూ లేరు అన్నాను అనేసరికి మరి నేను అని అడిగింది..ఐతే ఇప్పుడు పేరు చెప్తాను కానీ రేపు నన్ను నువ్వు వదిలేసి వెళ్ళిపోతే అని అడిగా దానికి నవ్వేసింది అంతే..." ఇలాగే ఉంటుంది ఫ్రెండ్ షిప్ అంటే అని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు అఖిల్.