English | Telugu
యావర్ తో నయని పావని పాట. శివాజీ ఏం చేశాడంటే!
Updated : Jan 12, 2024
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'గుంటూరు కారం' సినిమాలోని ఆ కుర్చీ మడతబెట్టి సాంగ్ నడుస్తుంది. చిన్న సెలబ్రిటీల నుండి పెద్ద స్టార్స్ దాకా ఈ పాటకి అదే కాస్ట్యూమ్ వేసుకొని అదిరిపోయే డ్యాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ నయని, యావర్ కలిసి ఈ పాటకి డ్యాన్స్ చేసారు. కాగా ఈ వీడియోకి ఇప్పుడు అత్యధిక వ్యూస్ వచ్చాయి. నయని పావని హౌస్ లో ఉంది వారం రోజులే అయిన శివాజీని నాన్న అని పిలవడంతో అందరికి దగ్గరైంది. హౌస్ లోని వారందికి నయని దగ్గరవ్వడం, దీనికి తోడు శివాజీతో ఉన్న రాపో తెలిసిందే. హౌస్ లో శివాజీ ఉన్నప్పుడు ఎలాగైతే ఓట్లు వేసేవారో ఇప్పుడు అదే రేంజ్ లో వీరిద్దరి కలిసి చేసిన డ్యాన్స్ రీల్ ని చూస్తున్నారు. కాబట్టే ఈ పాట అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ ని సంపాదించుకుంది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తమ ఆటతీరు, మాటతీరుతో ఫ్యాన్ బేస్ పెంచుకున్న యావర్, నయని పావని కలిసి ఈ పాటకి చిందలేశారు. బాస్ 2.0 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాద్ అమ్మాయి నయని పావని. ఈ అమ్మడు పెద్దగా పరిచయం లేని పేరే. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా అంత ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఢీ-14 షో కి వచ్చిన నయని.. కమెడియన్ హైపర్ ఆదితో కలిసి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది నయని. తను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే... నయనీకీ డాన్స్, షాపింగ్ అంటే ఇష్టమంట. నయని కలహం, మధురం అనే వెబ్ సిరీస్ లలో నటించింది. అదేవిధంగా సూర్యకాంతం మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా నటించింది నయని. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫోటలతో, రీల్స్ తో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది.
ఇప్పటికే తనకి ఇన్ స్ట్రాగ్రామ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉండగా, బిగ్ బాస్ ఎంట్రీ ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకోవాలని వెళ్ళింది. 2.0 లో ఎంట్రీ ఇచ్చిన నయని.. లోపల ఉన్నవాళ్ళ ఆటతీరుకి, బయట ప్రేక్షకుల స్పందననలని అన్నింటిని అనాలసిస్ చేసి వెళ్లింది. భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చిన ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ నయని.. హౌజ్ లోకి వెళ్ళి వారం రోజుల్లో బయటకి వచ్చేసింది కానీ ఎంతో ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. కాగా నయని పావని, ప్రిన్స్ యావర్‌తో కలిసి కుర్చీ మడతపెట్టి సాంగ్‌కి స్టెప్పులేసింది. ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. యావర్, నయని పావని ఇద్దరికి శివాజీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వారి ఫ్యాన్స్ ఈ పాటని ప్రమోట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.