English | Telugu
గోల్డెన్ లేడీ ఆఫ్ జీ తెలుగు ఈజ్ బ్యాక్ : ఉదయభాను రీఎంట్రీ
Updated : Jan 17, 2024
బుల్లితెర మీద ఒకప్పటి ఫేమస్ లేడీ యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఉదయభాను మాత్రమే...ఎవరేం అడిగిన చాలా డేర్ అండ్ డాషింగ్ గా ఆన్సర్స్ ఇస్తుంది. అలాగే షోస్ కి హోస్టింగ్ కూడా చేస్తుంది. అప్పట్లో అన్ని షోస్ కి ఉదయభాను యాంకరింగ్ చేసేది. తర్వాత కొంతకాలానికి ఆమె టీవీకి దూరమైపోయింది. ఇక చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ యాంకరింగ్ షురూ చేసింది ఉదయభాను.. జీ తెలుగులో త్వరలో ప్రసారం కాబోతోన్న షోతో హోస్ట్‌గా మరోసారి తన కెరీర్‌ను రీస్టార్ట్ చేయడానికి రెడీ ఐపోయింది. ‘‘అమ్మ చెప్పేది అమ్మగా గెలిస్తేనే అన్నింటిలో గెలిచినట్టు అని. అమ్మను అయ్యాకే అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. అన్నీ పక్కన పెట్టేశాను. పిల్లలే జీవితం అయిపోయారు.
నాకు అమ్మలు అయిపోయారు’’ అంటూ ఉదయభాను.. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన మాటలు ఈ ప్రోమోలో వినిపిస్తాయి. ఇక ఒక రూమ్ లో పిల్లలంతా డాన్స్ చేస్తూ ఉంటే ఆమె కాళ్ళు కూడా డాన్స్ చేస్తాయి. అప్పుడు వాళ్ళ పిల్లలు ‘‘ఆపొద్దు అమ్మ’’ అని చెప్పేసరికి "డాన్స్ ఫ్లోర్ లో నీ ఎనెర్జీ మళ్ళీ చూడాలనుంది" అనేసరికి ఉదయభాను ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇలా ‘సూపర్ జోడీ’ షోతో హోస్ట్ గా రీఎంట్రీ ఇవ్వనుంది ఉదయభాను. ‘గోల్డెన్ లేడీ ఆఫ్ జీ తెలుగు ఈజ్ బ్యాక్’ అనే ట్యాగ్‌తో ఉదయభాను ప్రోమోను విడుదల చేసింది జీ తెలుగు. ఇక ఈ ప్రోమోలో ‘సూపర్ జోడీ’ షో జనవరి 28న లాంచ్ కాబోతోంది. ఇక ఈ ‘సూపర్ జోడీ’ షోకు మీనాతో పాటు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మరో సీనియర్ నటీమణి శ్రీదేవి విజయ్ కుమార్ జడ్జిలుగా వ్యవహరించనున్నారు. ఐతే ఈ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీ పెయిర్స్ ఎవరన్న విషయం ఇంకా రివీల్ కాలేదు.