English | Telugu

హిమజ అరిసె కోసం పోటీపడుతున్న నెటిజన్లు!

ప్రతీ సంక్రాంతి పండగకి సిటీలో ఉన్న ఉద్యోగస్తులు, రోజు కూలీ చేసుకునేవారు, కళాకారులు..‌ ఇలా అన్ని రకాల వారు తమ తమ సొంత ఊర్లకి వెళ్తుంటారు. అయితే కొంతమంది సెలెబ్రిటీలకి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి వీలు కాదు. కాబట్టి వారున్న ఇంట్లోనే పండుగ జరుపుకుంటారు. పిండివంటలు చేసుకుంటూ తమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు తను చేసిన అరిసెను చూపిస్తూ హిమజ ఓ వీడియోని షేర్ చేసింది.

హిమజ.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా సినిమాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలలో‌ నటించిన హిమజ..‌ మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. విజయవాడలో పుట్టిన హిమజ.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమారంగంలోకి వచ్చింది. బిగ్ బాస్-3 లోకి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళిన హిమజ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో తను ఒక సెలబ్రిటీగా మారిపోయింది. హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో‌ నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది.

హిమజకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్ట్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. నిన్న మొన్నటిదాకా విదేశాలలో ట్రావెల్ చేసి వచ్చి‌న హిమజ.. సంక్రాంతికి అరిసెలు చేస్తూ ఓ‌ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అరిసెను అరిపించానంటూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అరిసెను అరిపించాను. ఆలస్యం చేసిన ఆశాభంగం అనే క్యాప్షన్ కూడా పెట్టేసింది ఈ భామ. ఇక ఈ స్పెషల్ అరిసె ఎవరికి కావాలంటూ హిమజ అడుగగా.. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.