English | Telugu
Guppedantha Manasu:మినిస్టర్ మీటింగ్ లో రిషి సీక్రెట్ మిషన్.. శైలేంద్రకి దిమ్మతిరిగిందిగా!
Updated : Jan 17, 2024
స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -975 లో.. హాల్లో కూర్చొని ఉన్న దేవయాని రిషి గురించి సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ చుసి నిజంగానే రిషి అలా అయిపోయాడా అని ధరణితో అనగానే.. అది నోరా ఇంకేమైనానా అని ధరణి కోప్పడుతుంది. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన మీరు.. ఇప్పుడు ఇలా అంటారా? ఏ దుర్మార్గుడు అలా పోస్ట్ పెట్టాడో అంటు ఇండైరెక్ట్ గా దేవయాని, శైలేంద్రలని ధరణి తిడుతుంది. ఆ తిట్లు భరించలేక దేవయాని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
నాకు తెలుసు అత్తయ్య ఆ పని మీరు మీ కొడుకే చేశారని ధరణి అనుకుంటుంది. రిషి సర్ కావాలంటూ స్టూడెంట్స్ గొడవ చేయడంతో ఏం చెయ్యాలో అర్థం కాని అనుపమ, మహేంద్ర, ఫణింద్ర కలిసి ఆలోచిస్తుంటేమ. అప్పుడే వాళ్ళ దగ్గరికి శైలేంద్ర వస్తాడు. స్టూడెంట్స్ ఏం అంటున్నారని ఫణింద్ర అడుగుతాడు.. వాళ్ళు గొడవ చేస్తున్నారు ఎంత అయిన రిషి వాళ్ళ ఫేవరెట్ సర్ కదా.. అయిన నా తమ్ముడు గురించి అలాంటి వార్తలు వస్తుంటే చాలా బాధగా ఉందని ఏడుస్తున్నటు నటిస్తాడు శైలేంద్ర. ఇక ఈ కాలేజీ మూతపడుతుందేమా? నా ముందే ఈ కాలేజీ ఇలా అవుతుందంటే చూడలేకపోతున్నానని శైలేంద్ర నటిస్తుంటాడు. నువ్వేం బాధపడకు శైలేంద్ర అంట ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత మినిస్టర్ వచ్చాడంటూ మీటింగ్ దగ్గరికి వెళ్తారు. మినిస్టర్ మాట్లాడుతు.. అసలేం జరుగుతుంది? ఈ వసుధార ఎక్కడ అని అడుగుతాడు. వస్తుందని మహేంద్ర చెప్పేలోపే అక్కడికి వసుధార వస్తుంది. నీపై నాకు ఎంతో నమ్మకం ఉండేది. స్టూడెంట్ నుండి ఈ స్థాయికి వచ్చవ్ కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని మినిస్టర్ అంటాడు.
కాసేపటికి రిషి ఎక్కడ ఉన్నాడని మినిస్టర్ తో పాటు బోర్డు మెంబెర్స్ కూడా అడుగుతారు. చెప్పు వసుధార రిషి ఎక్కడ అని అడుగుతున్నారు కదా అని శైలేంద్ర అంటాడు. మీకో మెసేజ్ వచ్చింది చూసుకోండని వసుధార అనగానే.. శైలేంద్ర తనకి వచ్చిన వాయిస్ మెసేజ్ చూస్తాడు. అందులో రిషి మాట్లాడుతాడు. కాలేజీ గురించి ఇప్పుడు ఎండీగా వసుధార అయితేనే నాకు కరెక్ట్ అనిపిస్తుందని అందులో ఉండగా అది ఫేక్ అంటు శైలేంద్ర అంటాడు. కాసేపటికి మినిస్టర్ కి రిషి స్వయంగా కాల్ చేస్తాడు. మీరు అప్పగించిన సీక్రెట్ మిషన్ రహస్యంగా చెయ్యమన్నారు కదా అందుకే ఎవరికి చెప్పకుండా చేస్తున్నా అని రిషి అనగానే.. సరే నేను ఇక్కడ పరిస్థితి చక్కదిద్దుతానని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత వసుధార వెళ్తుంటే శైలేంద్ర వచ్చి.. రిషి ఎక్కడ అని అడుగుతాడు. నీకెందుకురా అంటు మహేంద్ర వచ్చి శైలేంద్రపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.