English | Telugu

ఇంద్రధనుస్సు చీర కట్టి....అందానికి టాక్స్ కట్టాలనే రూల్ ఉంటేనా....

అనసూయ అంటే చాలు సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్. మంచిగా కామెంట్స్ పోస్ట్ చేస్తే పద్దతిగా రిప్లై ఇస్తుంది. అంతకు మించి ప్రవర్తిస్తే అలాగే ఘాటుగా వ్యవహరిస్తోంది. అనసూయ డోంట్ కేర్ అనే టైపు...హార్ట్ వరకు ఏ విషయాన్ని కూడా తీసుకోదు. అలాంటి అనసూయ తన లేటెస్ట్ అప్ డేట్స్ ని అన్నిటినీ కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు మకర సంక్రాంతి సందర్భంగా క్యూట్, లేటెస్ట్ పిక్స్ ని, తన ఫామిలీతో కలిసి ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. అలాగే ట్విట్టర్ లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పండగ శుభాకాంక్షలు అంటూ ఒక మెసేజ్ ని షేర్ చేసింది . అలాగే అనసూయ ఇంటి ముందు అందమైన రంగవల్లి వేసి ఇంకా అందమైన ఇంద్రధనుస్సు రంగుల చీరతో కన్ను కొడుతూ మరీ ఫోటో దిగేసరికి ఫాన్స్ అందరూ ఫిదా ఇపోయారు. ఈ పిక్స్ ని చూసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. "అందంగా ఉండే వాళ్లకు టాక్స్ కట్టాలని పెడితే మీరే ఎక్కువ కట్టాల్సి వస్తుంది..ఇంత అందాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు...ఒక అమ్మాయిగా నేను చాలా షాకవుతున్నా మీ బాడీని ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మీ శారీ చాలా బాగుంది.." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ యాంకరింగ్‌ ఆపేసి, వరుసగా మూవీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తోంది.. రీసెంట్ గా ఆమె విమానం అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే.. సముద్రఖని ప్రధాన పాత్రలో కనిపించరు. ఈ సినిమాలో అనసూయాది చిన్న పాత్రే అయిన ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ రోల్స్ లో అదరగొడుతోంది. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. ప్రస్తుతం యాంకరింగ్‌కు గుడ్’బై చెప్పిన అనసూయ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నారని తెలుస్తోంది. మధురవాణి క్యారెక్టర్‌లో అనసూయ కనిపించనుంది అనే టాక్ ఎప్పుడో వచ్చేసింది. ఐతే దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.