English | Telugu

నాకు చేతబడి చేస్తే నీకు మందు పెడతా ...!


మందుపెట్టుడు అంటే తెలుసా.. చెట్లకి మందుపెడితే పండ్లు కాస్తాయి.. మనుషులకి మందుపెడితే ఏం చెప్పినా చేస్తారు. పొలిమేర సినిమా చూసి ఎంతోమందికి మంత్రాలు, చేతబడి అంటే తెలియనివాళ్ళకి కూడా ఓ ఐడియా వచ్చేసింది. అయితే ఇవి మంచికంటే ఎక్కువగా చెడుకే వాడతారు. అరియానా గ్లోరీ మాత్రం సరదా సరదాగా మందు పెడతదంట.

ఆర్జీవీతో కలిసి చేసిన ఓ ఇంటర్వూ అరియానా కెరీర్ నే మార్చేసింది. యాంకర్‌గా కెరీయర్‌ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియాన గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చిన వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. బిగ్ బాస్ సీజన్‌-4 లో హౌస్ లోకి వెళ్ళి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. అవినాష్, సోహెల్, అరియానాల కాంబినేషన్ లో జోక్స్ కి బాగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

అరియానా గ్లోరీ తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్ వాట్ డూయింగ్ అని పెట్టగా .. నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటిల్లో కొన్నింటికి అరియానా సమాధానమిచ్చింది. చీరలో ఓ ఫోటో అప్లోడ్ చేయండి అని ఒకరు అడుగగా.. తను చీరలో దిగిన ఫోటోని అప్లోడ్ చేసింది. థింకింగ్ ఎబోట్ యూ అని ఒకరు అడుగగా.. సీరియస్లీ, నేను కూడా.. బై ద వే ఎవరు మీరు? అని రిప్లై ఇచ్చింది‌. థింకింగ్ ఎబోట్ యూ అని ఆర్జే చైతు అడుగగా.. ఎక్కువ థింక్ చేయకని చెప్పి చైతుకి ట్యాగ్ చేసింది. నువ్వు నా సోల్ మేట్ అవ్వాలని నీకు చేతబడి చేస్తున్నానని ఒకరు అడుగగా.. బ్రో.. అసలు నాకు బ్రో అని పిలిచే ఆలోచననే లేదు. సోల్ మేట్ అని చేతబడి చేస్తున్నానని అన్నావ్ కదా.. సీరియస్లీ .. అయితే నేను నీకు మందుపెడతా అని వీడియోలో చెప్పింది. తేజు అక్క గురించి మీ మాటల్లో అని ఒకరు అడుగగా.. మా నెవెర్ ఎండింగ్ కన్వర్సేషన్.. అమర్ తేజు అండ్ అరియానా అంతే.. అని తేజస్వినితో ఇరవై ఏడు నిమిషాలు మాట్లాడిన స్క్రీన్ షాట్ పెట్టింది. జై బాలయ్య అని ఒకసారి అనరా అని ఒకరు అడుగగా.. హే నేను కూడా బాలయ్య బాబు ఫ్యాన్ అని చెప్పి జై బాలయ్య అంటు అరిచేసింది. అనూజ అక్క గురించి చెప్పమని ఒకరు అడుగగా.‌ షీ ఈజ్ క్యూట్, అవినాష్ ఈజ్ లక్కీ అని రిప్లై ఇచ్చింది. ఇలా కొన్ని ప్రశ్నలకి సమాధానాలిచ్చింది అరియానా. కాగా ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉంది.