English | Telugu

Eto Vellipoyindhi Manasu: ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ మొదటి ఎపిసోడ్ ఎలా ఉందంటే!


స్టార్ మా టీవీలో విభిన్న కథతో ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు '. ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమోని కొన్నిరోజుల క్రితం విడుదల చెయ్యగా మంచి ఆదరణ లభించింది. దాంతో ఈ సీరియల్ పై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సీరియల్ నిన్న(22-01-2024) సోమవారం రోజున మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో ఏం ఉందంటే.. సీరియల్ మొదలు కావడమే గత జన్మలో సీతని చాటుగా చూసి రామ ప్రేమిస్తాడు. ఆ విషయం సీతకి తెలిసి తనకి కూడా ఇష్టమేనని చెప్తుంది. ఇంట్లో చెప్పకుండా సీత లేచిపోయి వస్తుంది. స్నేహితుడి సహాయంతో సీతని రామ పెళ్లిచేసుకుంటాడు.

ఆ తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామనే టైమ్ లో పెళ్లి ఇష్టం లేని సీత వాళ్ళ అన్నయ్య పరువు మర్యాదలే ముఖ్యమని భావించి రామని చంపేస్తాడు. ఆ దిగులుతో సీత కూడా చనిపోతుంది. ఈ జన్మలో మనల్ని విడదీసిన.. మన ప్రేమ వచ్చే జన్మలో కూడా ఉంటుందని గత జన్మకీ సంబంధించిన పాత్రలను ముగించారు డైరెక్టర్. ఇక ప్రస్తుతాన్ని చూపిస్తాడు. ఈ జన్మకి సంబంధించిన పరిచయంలో.. గత జన్మలో రామగా చనిపోయి ఈ జన్మలో సీతాకాంత్ గా, సీతేమో రామలక్ష్మిగా పుడతారు. సీతాకాంత్ పుట్టిన ఇరవై సంవత్సరాలకి రామలక్ష్మి జన్మిస్తుంది. వీళ్ళిద్దరు ఎలా మళ్ళీ ఒకటి అవుతురనేదే మిగతా కథ. రామలక్ష్మి సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటుంది‌. దాంతో పాటుగా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. రామలక్ష్మికి ఒక తమ్ముడు, చెల్లెలు ఉండగా.. తమ్ముడు కాలేజీ, చెల్లలు స్కూల్ చదువుతుంటారు. ఇక తల్లి వంటింటికి పరిమితం‌.. ఎప్పుడు జాతకాలంటు టీవీ చూస్తు వాటినే ఫాలో అవుతుండే ఓ సాధారాణ గృహిణి. తండ్రి బారెడు పొద్దెక్కిన లేవలేని ఓ తాగుబోతు. ఇక ఇంట్లో వీరందరి అవసరాలు తీరుస్తూ రామలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటుంది.

సీతాకాంత్.. కోటిశ్వరుడు. నలబై సంవత్సరాలైనా ఇంకా పెళ్లి చేసుకోని బిజినెస్ మెన్. అతడికి వివరితమైన ఓసీడి ఉంటుంది. తన చుట్టు నీట్ అండ్ క్లీన్ ఉండాలని ఎప్పుడు అనుకుంటాడు. అలా లేకపోతే పనిష్మెంట్ ఇస్తూ.. ఎక్కడా వెనక్కి తగ్గకూడదనే విషయాలని ఫాలో అవుతుంటాడు. కార్ డ్రైవర్ చాక్లెట్ తిని డ్రైవ్ చేస్తున్నాడని అతన్ని అక్కడే దింపి నడుచుకుంటు రమ్మని చెప్పి తను డ్రైవ్ చేస్తు వెళ్తాడు. మరొకవైపు రామలక్ష్మి కార్ ఓనర్ దగ్గరికి వస్తుంది‌. అక్కడ పెళ్లి జరుగుతుంటుంది. ఇక రామలక్ష్మి తన ఫ్రెండ్స్ తో కలిసి బరాత్ లో డాన్స్ చేస్తుంటుంది. అప్పుడే అదే రూట్ లో సీతాకాంత్ వస్తుంటాడు. ట్రాఫిక్ జామ్ కావడంతో సీతాకాంత్ కార్ దిగుతాడు. రామలక్ష్మి తన ఫ్రెండ్స్ అందరు కలర్స్ పూసుకుంటు ఉంటారు. అయితే ఆ ప్రాసెస్ లో అనుకోకుండా సీతాకాంత్ ఫై రామలక్ష్మి కలర్స్ చల్లుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. సారీ అంటూ రామలక్ష్మి చెప్పి కొద్దిదూరం వెళ్లి ఆగుతుంది. ఇద్దరికి గత జన్మ తాలూకూ జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి. వాళ్ళది గత జన్మ బంధమని ఇద్దరికి తెలుస్తుందా? వాళ్ళ బంధానికి వయసు అడ్డు కానుందా? ఇంతకీ రామలక్ష్మి, సీతాకాంత్ లు ఎలా ఒక్కటవ్వుతారనే ఆసక్తితో మొదటి ఎపిసోడ్ ముగిసింది. మరి ఆ తర్వాత ఏం జరుగనుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.