English | Telugu
గృహలక్ష్మి లాస్య ఎమోషనల్ పోస్ట్.. అప్పుడే ఈ జర్నీ అయిపోయిందా?
Updated : Jan 23, 2024
నిన్న మొన్నటిదాకా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ ముగిసింది. ఈ సీరియల్ లో లీడ్ రోల్ లో చేసిన కస్తూరి ఎంతగానో ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేసింది. ఇక ఈ సీరియల్ లో కస్తూరికి ధీటుగా విలనిజం చూపిస్తూ కార్తీక దీపం మోనితని గుర్తుచేసింది లాస్య అలియాస్ ప్రశాంతి. అసలు పేరు యాంకర్ ప్రశాంతి కానీ ఈ సీరియల్ లో తన పాత్ర పేరు లాస్య కాబట్టి అందరు తనని అలానే పిలుస్తున్నారంటు ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ప్రశాంతి తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో తను ఏం రాసిందంటే.. అప్పుడే ఈ బ్యూటిఫుల్ జర్నీ అయిపోయిందా? అనిపిస్తుంది. మీరు లాస్య రోల్‌ని ఎంత తిట్టుకున్నా.. ఆ రోల్‌ని ఎంతో ప్రేమించారు. నా పేరు ప్రశాంతి అని మర్చిపోయి లాస్య అని పిలుస్తున్నారు. ఈ సీరియల్లో ఇంత మంచి రోల్ రావడం నాకు ఆశీర్వాదమే. ఈ సీరియల్ అయిపోవడంతో చాలా మిస్ అవుతున్నా. తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలంటూ పోస్ట్ పెట్టింది లాస్య అలియాస్ ప్రశాంతి.
లేడీ విలన్ లాస్యగా అదరగొట్టేసింది. ఈమె మన తెలుగు అమ్మాయి కావడం విశేషం. నిజానికి మన తెలుగు సీరియల్స్‌లో తెలుగు వాళ్లకి అవకాశాలు చాలా తక్కువ. అందులోను లేడీ విలన్ అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలైతే అస్సలు దొరకవు. కానీ అందిపుచ్చుకున్న అవకాశానికి పూర్తి న్యాయం చేసింది లాస్య. తన హావభావాలతో.. అద్భుత నటనతో విలనిజం పండించింది. ఇంకా చెప్పాలంటే.. తులసి పాత్రను చాలా సందర్భాల్లో డామినేట్ చేసింది లాస్య. ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. జనం తిట్టుకునేవారంటే.. లాస్య పాత్రలో ప్రశాంతి ఎలా ఒదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షూటింగ్ సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ దగ్గరగా ఉండే ప్రశాంతి.. తన ఇంటింటి గృహలక్ష్మి టీమ్ కి ధన్యవాదాలు తెలియజేసింది. ఇక తనని అభిమానించిన ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్ చెప్పింది. ఇక తాజాగా కోడిపెట్డెని పట్టుకొని హాట్ ఫోటోలతో ఫోజులిచ్చింది ఈ భామ. కాగా ఈ ఫోటోలు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి.