English | Telugu

Prince Yawar : బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైమ్ యావర్ ని కలిసాను!

తెలుగు టీవీలో ప్రసారమయ్యే టీవీ షోస్, రియాలిటీ షోస్ లలో బిగ్ బాస్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంతోమంది చిన్న చిన్న సెలెబ్రిటీల నుండి పెద్ద స్థాయికి వెళ్ళినవారున్నారు. బిగ్ బాస్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్నవారిలో యావర్ కూడా ఒకడు.

బిగ్ బాస్ సీజన్-7 మొదలవ్వడమే ఉల్టా పల్టాగా మొదలైంది‌. ఇందులో మొదటగా పదమూడు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా అందులో ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ ముగ్గురు కలిసి స్పై బ్యాచ్ గా కలిసి ఉన్నారు. హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో యావర్ కి మొదట భాష ప్రాబ్లమ్ అవ్వగా.. మెల్లి మెల్లిగా శివాజీతో చేసిన స్నేహం అతడిలోని మంచివాడిని ప్రపంచానికి పరిచయం చేసింది. హౌస్ లో మొదటగా ఎవరేమన్నా అగ్రెసివ్ గా ఉండే యావర్ లో ప్రశాంత్, శివాజీ కలిసాక మార్పు మొదలైంది‌. ఏదైన మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడటం నేర్చుకున్నాడు. స్నేహంగా ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకున్నాడు యావర్.

సీజన్ సెవెన్ ముగిసాక ప్రశాంత్ జైలులో ఉన్నప్పుడు తన మద్దతుని తెలిపి అండగా నిలిచాడు. ఆ తర్వాత శివాజీ, భోలే షావలి, ప్రశాంత్ లతో కలిసి విందు భోజనం చేశాడు యావర్. ఇక ఈ మధ్యే రిలీజైన 'గుంటూరు కారం' సినిమాలోని ' ఆ కుర్చీని మడతబెట్టి' సాంగ్ కి నయని పావనితో కలిసి యావర్ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటింది‌. ఇక ఇప్పుడు తాజాగా తన ఫ్రెండ్ ఇమ్మాన్యుయల్ ని కలిసాడు యావర్.

జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో ఇమ్మాన్యుయల్ ఒకడు. బిగ్ బాస్ హౌస్ లో యావర్ ఉన్నప్పుడు అతడికి ఫ్రెండ్ గా స్టేజ్ మీదకి ఇమ్మాన్యుయల్ వచ్చాడు. ఇక ఇమ్మాన్యుయల్ తన యూట్యూబ్ ఛానెల్ లో 'బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైమ్ యావర్ ని కలిసాను' అనే వ్లాగ్ ని చేశాడు. 'గంగం గణేషా' సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటించారని, యావర్ కి భాష ప్రాబ్లమ్ కావడంతో అతడిని ఓ నిక్ నేమ్ తో పిలిచేవారిమని, అది బాగుందని డైరెక్టర్ ఆలోచించి దానిని సినిమాలో డైలాగ్ గా వాడుకున్నాడని ఇమ్మాన్యుయల్ ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు. ఇక తనకి బెస్ట్ ఫ్రెండ్ ఇమ్మాన్యుయలే అని చెబుతూ లవ్ యూ బ్రో అని చెప్పేసాడు యావర్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.