English | Telugu
Bhole Shavali : పల్లవి ప్రశాంత్ కోసం పాట పాడిన భోలే షావలి.. నెట్టింట వైరల్!
Updated : Jan 27, 2024
కష్టపడ్డా పాలమ్మిన పూలమ్మిన పాటతో యూట్యూబ్ లో సెన్సెషనల్ క్రియేట్ చేశాడు భోలే షావలి. పాటబిడ్డగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చాడు భోలే షావలి. ఎవరి అంచనాలకి అందకుండా ఎంట్రీ ఇచ్చిన భోలే షావలి హౌస్ లో ది బెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు.
ఎవరికి ఉండే ఫ్యాన్ బేస్ వారికుంటారనేది మరోసారీ నిరూపించాడు భోలే షావలి. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్, నయని పావని, పూజామూర్తి, అశ్వినిశ్రీలతో పాటు భోలే షావలి వచ్చాడు. వచ్చీ రాగానే నామినేషన్ లో సీరీయల్ బ్యాచ్ పై విరుచుకుపడ్డాడు భోలే. వాళ్ళు చేసే గ్రూపిజం గురించి వారితో ధైర్యంగా చెప్పి ఇన్ స్ట్రాగ్రామ్ లో ట్రోల్స్ చేసే పేజీలకు కంటెంట్ ఇచ్చాడు. పాటబిడ్డ పేరుకి న్యాయం చేసాడు భోలే షావలి. సీజన్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ జైలుకెళ్ళినప్పుడు లాయర్లతో వెళ్లి బెయిల్ వచ్చేలా చేసి తనకి సపోర్ట్ గా నిలిచాడు భోలే షావలి. దీంతో రియల్ హీరో అని విమర్శకుల చేత అనిపించుకున్నాడు.
జైలునుండి ప్రశాంత్ బయటకొచ్చాక అతడిని తన ఇంటికి తీసుకెళ్ళి విందుని ఏర్పాటు చేశాడు భోలే షావలి. ఇప్పుడు తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ ని ఉద్దేశించి ఓ పాటని పాడి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పాట ఏంటంటే.. రాదురా ఏ విజయం నీకోసం నాకోసం.. ఎక్కడికి పోదురా నువ్వు చేసిన కష్టం.. ఎప్పటికైనా అది నీకు సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది. సదాశయంతో సాగర ముందుకు అంటూ భోలే పాడిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. పల్లవి ప్రశాంత్ తో కలిసి ఈ వీడియోని ట్యాగ్ చేసాడు భోలే షావలి. కాగా దీనికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.