English | Telugu

నువ్వు నాకు దేవుడు ఇచ్చిన వరం రా పొట్టి ఫెలో..


"సూపర్ జోడి"డ్యాన్స్షో ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది.కొంతకాలం క్రితం జెమినీలో ప్రసారమైన 'కిర్రాక్ కామెడీ' షోకి యాంకర్‌గా చేసిన డాలి గురించి తెలుగు ఆడియన్స్ అందరికీ తెలుసు. అలాంటి డాలి ఈ షోలో పార్టిసిపేట్ చేసింది..సింగల్ గా కాదు జంటగా. అలాగే ఈ షోలో తన లవ్ ఎఫైర్ గురించి స్టేజి మీద బయట పెట్టింది. నటుడు, వీజే కరమ్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. వీరిద్దరూ కలిసి చాలా షోస్లో చేశారు. ఇప్పుడు 'సూపర్ జోడి' షోలో పార్టిసిపేట్ చేశారు.

యాంకర్ డాలీ-కరమ్ ఇద్దరినీ 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ హీరోయిన్ వర్ష పరిచయం చేసింది. డాలీ-కరమ్ ఇద్దరూ రెచ్చిపోయి మరీ రొమాంటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. "డాలీ నా లైఫ్‌లోకి వచ్చాక నా లైఫ్ చాలా బాగుంది" అంటూ కరమ్ తన అభిప్రాయం చెప్పాడు. " నా ఫ్రెండ్ డాలీ ఎప్పుడు ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెడుతుందా అని ఎదురుచూశాను.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది" అంటూ వర్ష చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన ప్రేమను చెప్పింది డాలీ. "వర్షాలు..మేము కలవాలి అని నాకంటే ఎక్కువగా నువ్వే ఆలోచించావు. నాకు నీలాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం ...ఇక కరమ్ బేబీ ఫైనల్లీ అనుకున్నది జరగింది.. మన కొత్త జర్నీని స్టార్ట్ చేద్దాం.. కన్నా.. నా జీవితంలో ఎప్పుడూ ఊహించని బెస్ట్ గిఫ్ట్ నువ్వే. నా పైన నువ్వు చూపించే ప్రేమని చూస్తే నీ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన వరం రా పొట్టి ఫెలో " అని క్యూట్ గా తన లవ్ ని చెప్పింది . వీళ్ళ లవ్ మేటర్ తెలిసేసరికి ఈ జంటకి అందరూ విషెస్ చెబుతున్నారు. ప్రేమ ఎంత మధురం హీరోయిన్ వర్ష, కరమ్, డాలీ కలిసి జాలీగా ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. ఇక ఈ షోలో మొత్తం 8 సెలబ్రెటీ జోడీలు ఈషోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందాల నటి మీనా, శ్రీదేవి విజయ్‌కుమార్, రఘు మాస్టర్ ఈ షోకి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.