English | Telugu

సోహైల్ కోసం సుమ, ప్రేమ్ రక్షిత్ అలా చేశారట

ఈ వారం సుమ అడ్డా ఎంటర్టైన్మెంట్ షోకి బూట్ కట్ బాలరాజు మూవీ టీమ్ వచ్చి ఎంటర్టైన్ చేసింది. ఇందులో సోహైల్ ని ఫస్ట్ టాస్క్ ఆడించింది సుమ. ఆ టైంలో సోహైల్ సుమ చేసిన ఒక మంచి పని గురించి చెప్పాడు. సందర్భం వచ్చింది కాబట్టి తన మనసులో మాట బయట పెట్టాలనుకున్నట్టు చెప్పుకొచ్చాడు.

"నా బూట్ కట్ బాలరాజు మూవీ ప్రమోషన్స్ కోసం నేను సుమక్క వాళ్ళ మేనేజర్ కి ఫోన్ చేసి నేను అంత డబ్బులు ఇచ్చుకోలేను కొంత తగ్గించమని అడిగాను. సరే అని అడిగి చెప్తాను అన్నారు. తర్వాత అక్క నాకు కాల్ చేసింది. అప్పుడు అక్కా.. నా దగ్గర అంత అమౌంట్ లేదు. కొంతే ఇద్దామనుకుంటున్నా ఎందుకంటే నేను ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నా సినిమా..చాలా కష్టపడ్డాను అని అడిగాను. అరేయ్ నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను నా కొడుకుకు నేను ఎంతగా ప్రమోషన్ చేసానో అదంతా నాకు తెలుసు. లైఫ్ లో ఎదిగి ఇంత పేరు సంపాదించుకున్నది ఎందుకు, మీలాంటి వాళ్లకు ఉపయోగపడాలి అని చెప్పి నాకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫ్రీగా చేసి పెడతాను అన్నారు. థాంక్యూ సో మచ్ అక్కా..ఈ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను...అలాగే ఈ సినిమాలో బూటుబూటు బూట్ కట్ బాలరాజు అనే సాంగ్ ని ప్రేమ్ రక్షిత్ మాష్టర్ ఫ్రీగా చేసి పెట్టారు. ఒక స్థాయికి వచ్చాక ఒకరికి ఉపయోగపడకపోతే ఇంకెందుకు అంటూ ఫ్రీగా చేశారు. ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా పెద్ద కాంపిటీషన్ నడుస్తోంది. మీరంతా అనుకుంటున్నట్టు మాది కలర్ ఫుల్ లైఫ్ కాదు..బ్లాక్ అండ్ వైట్ లైఫ్.. మీ సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం..లేదంటే లేదు" అంటూ సుమా కాళ్లకు వంగి దణ్ణం పెట్టుకున్నాడు సోహైల్. బూట్ కట్ బాలరాజు ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోలో ఈ టీం పార్టిసిపేట్ చేసింది.