English | Telugu
ఐనా నీకు లవ్ ఎందుకు అక్క...
Updated : Feb 17, 2024
జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర సోషల్ మీడియాలో మంచి జోష్ గా కనిపిస్తోంది. పొట్టి పిల్ల కధమ్మో గట్టి పిల్ల ఇది అన్నట్టుగా పంచులు వేస్తూ అలరిస్తూ ఉంటుంది పవిత్ర. టైమింగ్ ఉన్న కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే పవిత్ర గురించి అందరికీ తెలిసిన విషయమే.. ఈమె రీసెంట్ గా తన లవర్ సంతోష్ కి బ్రేకప్ చెప్పేసింది అది కూడా ప్రేమికుల రోజున. ఐతే ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పిక్ పెట్టింది. దానికి కాప్షన్ గా "మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేయండి" అని పెట్టేసరికి నెటిజన్స్ ఫుల్ గా కామెంట్స్ చేస్తున్నారు. "ఓవర్ యాక్షన్, బ్రేకప్ అయ్యిందా అక్కా..ఐనా నీకు లవ్ ఎందుకు అక్కా హ్యాపీగా ఉండొచ్చుగా...అక్క..సంతోష్ అన్న ఎక్కడ" అని అంటున్నారు. ఐతే కొన్ని నెలల క్రితం రింగ్స్ మార్చుకున్న సంతోష్- పవిత్ర ఇద్దరూ విడిపోయారు. ఐతే ఎం జరిగిందో, ఎందుకు విడిపోయారో ఎవరికీ తెలీడం లేడు.
ఐతే నెటిజన్స్ ఐతే ప్రేమిస్తున్నాం అని పబ్లిక్ గా చెప్తున్నారు...విడిపోతున్నాం అని కూడా పబ్లిక్ గా చెప్తున్నారు. ఎందుకిలా...అంటున్నారు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కమెడియన్ గా చేస్తుంది. అలానే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ సంపాదించుకుంటోంది. ప్రేక్షకులకు కూడా ఆమె కామెడీ టైమింగ్ నచ్చడంతో సీరియల్స్ లో కూడా నటించే అవకాశం కొట్టేసింది. భాస్కర్, వెంకీ మంకీస్, హైపర్ ఆది.. ఇలా ప్రతీ టీమ్‌లోనూ కామన్‌గా కనిపించేది పవిత్ర.. సోషల్ మీడియాలో ఈమె చేసే వీడియోస్ ని, జబర్దస్త్ కమడియన్ టీం లీడర్లు చూసి పవిత్రను కాంటెక్ట్ అయ్యారు. అలా జబర్దస్త్ లోకి వచ్చి సెటిల్ ఐపోయింది. ఎలాంటి డైలాగ్ ను అయిన ఈజీగా చెప్పేసే పవిత్ర మూవీస్ లో కూడా చిన్న చిన్న రోల్స్ లో కనిపిస్తోంది.