English | Telugu

ప్రదీప్ కి పెళ్లి సెట్ అయ్యిందా ?

బుల్లితెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది యాంకర్ ప్రదీప్ మాచిరాజు అన్న విషయం గురించి తెలిసిందే. టీవీ హోస్ట్‌గా పాపులారిటీ సంపాదించిన ప్రదీప్ పెళ్లి కోసం ఫాన్స్ అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. అప్పట్లో పెళ్లి కోసం ఒక టీవీ ప్రోగ్రాం పెట్టి స్వయంవరం చేసుకున్న ప్రదీప్ మీద కొన్ని నెగటివ్ ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అయ్యింది. సెలబ్రిటీ స్టైలిష్ట్ తో ప్రదీప్ నిశ్చితార్థం అయిపోయిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఐతే ఇదంతా ఏమీ లేదని ఆ అమ్మాయి పేరును మధ్యలోకి లాగొద్దని ఫామిలీ అంతా బాధపడతారని చెప్పాడు. అలాంటి ప్రదీప్ కొంత కాలం క్రితం వరకు ప్రతీ షోకి హోస్ట్ గా ఉండేవాడు. మరి ఏమయ్యిందో తెలీదు కానీ ప్రస్తుతం బుల్లితెర మీద ఏ షోలో కూడా కనిపించడం లేదు.

ఇక ఆయన ఫాన్స్ మాత్రం ప్రదీప్ గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో పెళ్లి కొడుకు గెటప్ లో కనిపించేసరికి ఆయన ఫాన్స్ అంతా మెసేజెస్ మీద మెసేజెస్ ఇస్తూ పెళ్లా అని అడుగుతున్నారు. "అన్నా పెళ్లి సెట్ అయ్యిందా.. పెళ్లి చూసుకున్నావా..పెళ్ళికి వెళ్తున్నావా.. టీవీ షోస్ లో మా ప్రదీప్ గారిని చాల మిస్ అవుతున్నాం..మీరేమైనా చూసారా ...ముఖంలో పెళ్లి కళ బాగా వచ్చింది బ్రో..మేల్ క్రష్ అన్నా మీరు...ఏమైపోయావ్ బ్రో వేర్ ఆర్ యు షోస్ చూడాలి అనిపించట్లేదు మిస్సింగ్ యు ఆన్ స్క్రీన్ మూవీ షూటింగ్ అయితే మంచి బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇవ్వాలి...ప్రదీప్ అన్న పెళ్లి అయ్యింది." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ప్రదీప్ లేని లోటును మాత్రం ఆయన ఫాన్స్ చాల ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు షోస్ లో కనిపిస్తారని ప్రతీ సీరియల్ ప్రోమో కింద కామెంట్స్ అడుగుతున్నారు. కానీ ప్రదీప్ మాత్రం అసలు తాను షోస్ లో ఎందుకు కనిపించడం లేదో కూడా చెప్పకుండా మాయమైపోయాడు.