English | Telugu

టీఆర్పీలో బ్రహ్మముడి నెంబర్ వన్.. టాప్ లో  ఆ రెండు సీరియల్స్!

బుల్లితెర ధారావాహికల్లో ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ , ఏది నెంబర్ వన్ , దేనిని ప్రేక్షకులు ఎక్కువగా వీక్షిస్తున్నారో ఓ లుక్కేద్దాం.. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో స్టార్ మా టీవీలోని సీరియల్స్ టాప్-5 లో ఉన్నాయి.

మొట్టమొదటి స్థానంలో 'బ్రహ్మముడి' సీరియల్ ఉండగా.. రెండవ స్థానంలో 'నాగపంచమి', మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' , నాల్గవ స్థానంలో స్థానంలో 'నువ్వు నేను ప్రేమ' , అయిదవ స్థానంలో 'గుప్పెడంత మనసు' సీరియల్స్ ఉన్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ రెండవ స్థానంలో ఉండగా.. అదర్శ్ , ముకుందల మధ్య జరిగే సంభాషణలు అంతగా బాగుండటం లేదని.. కృష్ణ , మురారీల లవ్ ట్రాక్ బాగున్నప్పటికీ అది అంతగా రీచ్ అవ్వట్లేదని ప్రేక్షకులు కామెంట్లతో తెలియజేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే మొదటి స్థానంలో బ్రహ్మముడి కొనసాగుతుంది. ఇక ఎప్పుడో పండగకి గానీ పెరగని రేటింగ్ 'నువ్వు నేను ప్రేమ' సీరియల్ కి ఇప్పుడు వీకెండ్ లోనే వచ్చేసింది. అదీ కాకుండా గుప్పెడంత మనసు సీరియల్ తో పోటీపడుతోంది.

గుప్పెడంత మనసులో నిన్న మొన్నటి వరకు రిషి వస్తాడనే క్యూరియాసిటితో ఎక్కువ మంది చూసారు. అప్పుడు ఈ సీరియల్ మూడవ స్థానంలో ఉండగా ప్రస్తుతం రిషి రావడానికి టైమ్ పడుతుందని చెప్పడంతో అయిదవ స్థానానికి పడిపోయింది. ఇక రిషి స్థానంలో మరో కొత్త క్యారెక్టర్ ని తీసుకురావడంతో ఎవరతను అనే ఇంటెన్స్ ని క్రియేట్ చేశారు కానీ రిషి లేకుంటే జనాలు ఎవరు చూడరనే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు. రిషి వచ్చాకే ఈ సీరియల్ మళ్ళీ ట్రెండింగ్ లో ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే బ్రహ్మముడి సీరియల్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. కావ్యని ఆటపట్టించడానికి రాజ్ తన స్నేహితురాలు శ్వేతతో రిలేషన్ షిప్ ని నటిస్తుండగా.. ఇందిరాదేవి వచ్చి కావ్య చేత కొత్త నాటకం మొదలుపెడతుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.