English | Telugu

యాదమ్మరాజు-స్టెల్లా కొత్త బిజినెస్... ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదా!

యాదమ్మ రాజు జబర్దస్త్, పటాస్ షోస్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టెల్లని లవ్ మ్యారేజ్ చేసుకుని తనతో పాటు షోస్ కి, ఈవెంట్స్ కి తీసుకొస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇక వీళ్లకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అలాంటి స్టెల్లా ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ కి స్టార్ట్ చేయబోతోంది. అదే ఈవెంట్స్ డెకర్ పేజీని రెడీ చేసింది స్టెల్లా. పెళ్లి కాక ముందు ఫాదర్ సపోర్ట్, పెళ్లయ్యాక హజ్బెండ్ సపోర్ట్ లేడీస్ కి చాలా ముఖ్యం అని చెప్పింది. ఐతే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదా. అందునా తాను బిజినెస్ చేయాలనీ డిసైడ్ ఐనట్లు చెప్పింది. "ఈవెంట్స్ బై స్టెల్లా రాజ్" అనే లోగో తయారు చేయించింది.

దాన్ని తన భర్త యాదమ్మ రాజుతో ఓపెన్ చేయించింది. రాజు కూడా వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ అందించబోతున్నారో చెప్పాడు. పెళ్లి, రిసెప్షన్, హల్దీ, బర్త్ డే, సీమంతం, డిజె, లైటింగ్, సౌండ్ సిస్టం, మెహందీ, గృహప్రవేశం, ఎంగేజ్మెంట్ , ఫొటోగ్రఫీ, డెకొరేషన్ ఇలాంటి అన్ని రకాల ఈవెంట్స్ ని నిర్వహిస్తాం. ఇక స్టెల్లాకి చిన్న ఈవెంట్ ఐనా, పెద్ద ఈవెంట్ ఐనా కూడా మంచిగా ఆర్గనైజ్ చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పింది. అలాగే రాజు బర్త్ డే ఈవెంట్ ని కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశానని చెప్పింది. ఇక పటాస్ కమెడియన్ యాదమ్మ రాజు-స్టెల్లా.. పెద్దల్ని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళైన వెంటనే ఒక షోలో వీళ్ళు విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లు కామెడీ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. షో ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులు కూడా చేస్తారా అంటూ నెటిజన్స్ వీళ్ళను బాగా తిట్టి పెట్టారు కూడా. తర్వాత అదేం లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ జంట ప్రస్తుతం పలు రకాల షోలు, ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉన్నారు. యాదమ్మ రాజు జబర్దస్త్ షోలో చేస్తూ కమెడియన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుని మూవీస్ లో కూడా నటిస్తున్నాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..