English | Telugu

పెళ్లి షాపింగ్ చేసిన శుభశ్రీ, టేస్టీ తేజ


శుభశ్రీని టేస్టీ తేజ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ సందర్భంగా పెళ్లి షాపింగ్ కూడా ఇద్దరూ కలిసి చేశారు. శుభశ్రీ కోసం ఎన్నో చీరలు కూడా కొన్నాడు. పెళ్ళికొడుకు పెళ్లి కూతురుకు బట్టలు పెట్టాలి కదా..ఎం నచ్చితే అవి కొనేసుకో అని ఫుల్ పవర్స్ శుభశ్రీకి ఇచ్చేసాడు తేజ.

ఎంగేజ్మెంట్ కి మంచి డ్రెస్ కలెక్షన్స్ చూపించమని షాప్ లో అమ్మాయిని అడిగేసరికి తేజ- శుభశ్రీ పెయిర్ ఎం బాలేదు అని చెప్పింది. ఆ మాటకు షాకయ్యాడు తేజ. తలంబ్రాల చీర, పెళ్లి చీర, ఫస్ట్ నైట్ శారీ ఇవన్నీ తీసుకోవాలి అనేసరికి శుభశ్రీ లాగి పెట్టి తేజ చెంప మీద ఒక్కటిచ్చింది. తేజ చీరలు సెలెక్ట్ చేయకుండా పడుకునేసరికి శుభశ్రీ లేపి అన్ని చీరలు కొనేయాలనిపిస్తోంది అంటూ చెప్పడంతో అవాక్కయ్యాడు. ఈమెకు చీరలు కొనడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. ఇన్ని చీరలు కొనిచ్చే బదులు పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ అన్నాడు టేస్టీ తేజ. ఎవరైనా ఇన్ని చీరలు కొనిచ్చేవాళ్ళుంటే రండి బ్రో..ఈమెను మెయింటైన్ చేయడం తన వల్ల కాదు బ్రో అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బిగ్ బాస్ లో తనదైన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది శుభ శ్రీ. 2020 ఫెమినా మిస్ ఇండియా ఒడిషా టైటిల్ ని సొంత చేసుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత ఈమెకు మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయి. అలాగే శుభశ్రీ చాలా యాడ్స్ లో కూడా నటించింది. కొత్తగా వచ్చిన రుద్రవీణ , ‘కథ వెనక కథ’, అమిగోస్ లాంటి మూవీస్ లో కనిపించింది శుభ శ్రీ. ఇక తేజతో కలిసి బిగ్ బాస్ సీజన్ 7 లో రచ్చ చేసింది ఈ అమ్మడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తేజ బిగ్ బాస్ హౌస్ లోని లేడీ హౌస్ మేట్స్ అందరితో షాపింగ్స్ చేస్తూ ఆ వీడియోస్ ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.