English | Telugu

కార్తీకదీపం బానే భయపెట్టింది...దీపనే పెళ్లి చేసుకుంటా అన్న డాక్టర్ బాబు

కార్తీకదీపం సీజన్ 2 త్వరలో పట్టాలెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక దీని గురించి సోషల్ మీడియాలో కూడా టాక్ ఫుల్ గా నడుస్తోంది. ఇక ఇదే టాపిక్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం లో నడిచింది. ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ షో 75 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫుల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. అలాగే ఈ షోకి వచ్చే బుల్లితెర నటీనటులకు వారి టాలెంట్ కి తగ్గట్టు అవార్డ్స్ ని కూడా అందించారు.

ఇక మధ్యలో కార్తీక దీపం టాపిక్ వచ్చింది. శ్రీముఖి డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాలను ఒక ప్రశ్న వేసింది. "మీకు ఇప్పుడు ముగ్గురు అమ్మాయిల పేర్లను చెప్తాను . దీప, మోనిత, శ్రీముఖి.. ఈ ముగ్గురిలో ఎవరిని చంపాలనుకుంటావ్, ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటావ్, ఎవరితో హుకప్ కావాలనుకుంటావ్" అని అడిగింది. దానికి డాక్టర్ బాబు ఆన్సర్ ఇచ్చాడు. మోనితను చంపేస్తాను, శ్రీముఖితో హుకప్ అవుతాను, వంటలక్కను పెళ్లి చేసుకుంటాను" అనేసరికి శ్రీముఖి ఫుల్ జోష్ తో నవ్వేసింది. ఇంతలో అంబటి అర్జున్ ఎంట్రీ ఇచ్చి "బానే బయపెట్టిందిరా కార్తీకదీపంలో దీప..పెళ్లి వరకు వెళ్ళావు అంటే తెలుస్తోంది.." అనేసరికి డాక్టర్ బాబు ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఇలా ఈ షోలో అందరితో టాస్కులు ఆడించింది శ్రీముఖి. షో స్టార్టింగ్ లో హరి తాను రాసిన పంచులతో ఇన్ని ఎపిసోడ్స్ ని ముందుకు తీసుకువెళ్లాను అని చెప్పాడు. తర్వాత అవినాష్ వచ్చి తాను చేసిన రొమాన్స్ తోనే ఇన్ని ఎపిసోడ్స్ ముందుకు వెళ్ళిందంటూ ఇద్దరూ డప్పు కొట్టుకున్నారు. ఐతే డాక్టర్ బాబు మాత్రం ఆదివారం విత్ స్టార్ మా పరివారం సక్సెస్ కావడానికి కారణం "శ్రీముఖి అందం, అవినాష్ కామం, హరి నినాదం..ఎవరినీ వదలం" వీటి వల్లే షో సక్సెస్ అయ్యింది అని చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.