English | Telugu
కెవ్వు కార్తిక్ కొత్త వ్లాగ్.. ఏం ఉందంటే!
Updated : Feb 25, 2024
సెలబ్రిటీల హోమ్ టూర్ నుండి కిచెన్ టూర్ దాకా ఏది చేసినా ఎటు వెళ్ళినా ఆ వీడియోలు వైరల్ అవుతాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి.. కొందరికి రాయడం ఇష్టం.. కొందరికేమో పాడటం ఇష్టం.. పెయింటింగ్స్ వేయడం.. డ్యాన్స్ చేయడం, నటించడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చుతుంది. చాలామంది దాన్ని టైంపాస్‌గా భావిస్తారు. కానీ కళాకారులు మాత్రం వాటినే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. అలా హాస్యాన్ని నమ్ముకుని, అందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నవాళ్లు ఎంతోమంది ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. వారిలో ఒకరే జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్.
తన పంచులతో, స్కిట్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కెవ్వు కార్తీక్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఏడాది క్రితం కొత్త ఇల్లు కొనుక్కున్న కార్తీక్ తాజాగా హోమ్ టూర్ వీడియో చేయగా అది ఫుల్ వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోకి వచ్చిన వ్యూస్, కామెంట్లని దృష్టిలో పెట్టుకొని మరో వ్లాగ్ చేసాడు కార్తిక్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కెవ్వు కార్తిక్ కమెడియన్ గా, రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముక్కు అవినాష్ తో కలిసి కెవ్వు కార్తిక్ చేసే స్కిట్లు అప్పట్లో ఫుల్ ట్రెండింగ్ లో ఉండేవి. అలా ఇద్దరు ఫేమస్ అయ్యారు.
తాజాగా కెవ్వు కార్తిక్ తన యూట్యూబ్ ఛానెల్ లో 'ట్రెక్కింగ్ లో మేమ్ చేసిన సాహసాలు ' అనే వ్లాగ్ చేశాడు. యూకేలోని కొన్ని ఎత్తైన కొండల మీదకి ట్రెక్కింగ్ చేసిన కార్తిక్, సిరీ జంట అక్కడ వారి అనుభవాలని పంచుకున్నారు. అలాగే అక్కడ దగ్గరలోని ఓ రిజర్వాయర్ దగ్గరకి వెళ్ళి అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉంటుందో చూపించారు. అక్కడ రిజర్వాయర్ లో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి ఫ్లక్ హోల్స్ అనేవి కట్టారని చెప్పాడు కెవ్వు కార్తిక్. ఇక ఇద్దరు కలిసి అక్కడి చూడదగిన ప్రదేశాలని నెటిజన్లకి చూపించారు. ఫ్యామిలీతో కలిసి మీరు కూడా ఇలా ట్రెక్కింగ్ ప్లాన్ చేయండి అంటూ ఈ జంట వ్లాగ్ లో వివరించారు. కాగా ఇది యూట్యూబ్ లో ఫుల్ వైరల్ గా మారింది.