English | Telugu

థంబ్ నెయిల్స్ కోసం రాకెట్ రాఘవ తిప్పలు మామూలుగా లేవు

సోషల్ మీడియా వేగం బాగా పెరిగాక థంబ్ నెయిల్ కల్చర్ బాగా ఊపందుకుంది. లోపల మ్యాటర్ లేకపోయినా థంబ్ నెయిల్ ని మంచి షార్ట్ అండ్ స్వీట్ గా తయారు చేసి పెడుతూ ఉంటారు యూట్యూబర్స్. ఇప్పుడు ఇదే సజెక్టు మీద జబర్దస్త్ లో ఒక స్కిట్ పేల్చాడు రాకెట్ రాఘవ.

రాఘవ స్కిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది చేసినా అందులో ఒక మెసేజ్ ఉంటుంది. ఐతే రీసెంట్ గా రిలీజ్ ఐన జబర్దస్త్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. కెమెరాని స్టాండ్ కి సెట్ చేసి వీడియోస్ తీస్తూ స్టేజి మీదకు వచ్చాడు రాఘవ. "ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను మేడం...రాకెట్ రాఘవకు రెస్పెక్ట్ ఇస్తున్న ఇంద్రజ మేడం థంబ్ నెయిల్ మేడం" అనేసరికి ఆమె నవ్వేసుకుంది. తర్వాత హాయ్ సిరి గారు అంటూ వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. "రాకెట్ రాఘవ చేతిని పట్టుకుని వదలనంటున్న సిరి..ఎందుకో తెలిస్తే షాకవుతారు.." థంబ్ నెయిల్ అని చెప్పేసరికి సిరి కూడా నవ్వుకుంది.

ఈ ఎపిసోడ్ లో నూకరాజు కమల్ హాసన్ లా చేసిన స్కిట్ కి అందరూ పడీ పడీ నవ్వుకున్నారు. స్వాతిముత్యం మూవీ సీన్ ని స్పూఫ్ గా చేసి చూపించాడు. నాటీ నరేష్ నూకరాజుకు గమకాలు నేర్పించడం, అతను నేర్చుకుని పాడడం కొంచెం నవ్వు తెప్పించేదిగా ఉంది. ఈ ప్రోమో కింద నెటిజన్స్ కామెంట్స్ మాములుగా లేవు. "ఈరోజుల్లో నూకరాజు కేవలం మూవీస్ స్పూఫ్స్ ని మాత్రమే చేస్తున్నాడు తప్ప సొంత స్క్రిప్ట్స్ ఏమీ చేయడం లేదు...రాకెట్ రాఘవ స్కిట్స్ మాత్రమే బాగుంటాయి. జబర్దస్త్ బాగా వీకైపోయింది" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో జబర్దస్త్ ఎంతో కామెడీని పండించేది. కానీ రానురాను ఆ క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా బాగా తగ్గిపోయింది. దాంతో జబర్దస్త్ కి రేటింగ్ కాస్త తగ్గిందనే చెప్పాలి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..