English | Telugu
Guppedantha Manasu : నువ్వు హీరోనా.. రిషి సార్‌తో నీకు పోలికా!
Updated : Feb 25, 2024
గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి వెళ్ళిపోయాక మను పేరుతో ఒక కొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడు. అతని అసలు పేరు రవిశంకర్ రాథోడ్. ఇతను ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో తులసికి రెండో కొడుకు రోల్ లో నటించాడు. అతనే ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్నాడు. రవిశంకర్ ఆల్రెడీ ఆనందరాగం, రావోయి చందమామ వంటి సీరియల్స్‌లో కూడా నటించాడు కానీ అతను పెద్దగా ఫేమస్ ఐతే కాలేదు. గుప్పెడంత మనసు సీరియల్‌లో మనుగా ఆడియన్స్ ని బాగా అలరిస్తున్నాడు. అనుపమ కొడుకుగా మనుని చూపిస్తూ మదర్ సెంటిమెంట్ ని డైరెక్టర్ వర్కౌట్ చేస్తూ ఆడియన్స్ ని మళ్ళీ తమ వైపు తిప్పుకుని సీరియల్ కి రేటింగ్ పెంచుకునే పనిలో పడ్డారు.
ఇలాంటి టైంలో రవిశంకర్ రాథోడ్, వసుధారా అలియాస్ రక్షా గౌడ ..రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టారు. చాలామంది నెటిజన్స్ రవి నటన బాగుందంటూ పొగిడేశారు. కానీ రిషి ఫ్యాన్స్ అంతా దూసుకొచ్చి రిషి గురించి అడగడం స్టార్ట్ చేశారు. అప్పటికి రవి శంకర్ ఓపికగా సమాధానాలు ఇస్తూనే ఉన్నాడు. ఐతే ఒక అమ్మాయి మాత్రం "నువ్వు హీరో ఎలా అయ్యావ్ .. రిషి సార్‌తో నీకు పోలికా" అనేసరికి "నా ముఖానికి ఏమైంది.. అయినా డాక్టరే అయ్యా యాక్టర్ కాలేనా?" అంటూ కామెడీగా ఆన్సర్ ఇచ్చాడు రవి శంకర్ రాథోడ్. రవి శంకర్.. కేవలం యాక్టరే కాదు డెంటల్ సర్జన్‌గా క్లినిక్ నడుపుతున్నాడు. ఇక రవి శంకర్ ‘హనుమాన్’ మూవీలో హీరో తేజా అక్క పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్‌ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు రోల్ లో నటించాడు.