English | Telugu
శుభశ్రీ రాయగురు పోస్ట్ చేసిన వీడియో వైరల్.. అందులో అసలేం ఉందంటే!
Updated : Feb 28, 2024
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయిన వారిలో శుభశ్రీ రాయగురు ఒకరు. ఒడిశాలో పుట్టిపెరిగిన ఆమె 2022లో వచ్చిన తెలుగు సినిమా రుద్రవీణ, తమిళ సినిమా డెవిల్ లతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తరువాత 2023లో అమిగోస్, కథ వెనుక కథ వంటి పలు చిత్రాల్లోనూ ఆమె నటించింది. ముంబైలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసిన శుభశ్రీ.. లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆమెకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అలా 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత టెలివిజన్ యాంకర్‌గా మారింది. హిందీ సినిమా మస్తీజాదే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేసింది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదలవ్వడమే ఉల్టా పల్టా థీమ్ తో మొదలైంది. ఎన్నో అంచనాల మధ్య హౌస్ లోని కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి అదరహో అనిపించారు . ఈ సీజన్ సెవెన్ లో లాయర్ కమ్ యాక్టర్ గా శుభశ్రీ అడుగుపెట్టింది. ఓ నామినేషన్ లో అమర్ దీప్ తో జరిగిన గొడవలో.. దమ్ముంటే నామినేషన్ పాయింట్ చెప్పు బ్రో.. మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటి అంటు క్యూట్ గా ఏడ్చేసింది శుభశ్రీ. దాంతో ఒక్కసారిగా ఇన్ స్టాగ్రామ్ లో ట్రోలర్స్ కి కంటెంట్ దొరికినట్టైంది.
శుభశ్రీ రాయగురు తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఇదేంటంటే.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ పూజామూర్తి, నయని పావని, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టీ తేజ, అమర్ దీప్, ఇంకా యాంకర్ ధనుష్ కూడా వచ్చాడు. అయితే వీళ్ళంతా కలిసి గ్రూప్ ఫోటో దిగుతుండగా ధనుష్ మీద ఎక్కేసాడు గౌతమ్ కృష్ణ . ఇక ఫోటో తోయడానికి చాలా టైమ్ పట్టినట్టుంది. దాంతో అతను ఫ్రస్టేషన్ గా అతనివైపు కోపంతో చూసాడు. అది చూడకుండా శుభశ్రీ తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియోని అప్లోడ్ చేసింది. అసలే నిజంగానే గౌతమ్ కృష్ణ మీద యాంకర్ ధనుష్ సీరియస్ అయ్యాడా లేక వ్యూస్ కోసం.. వైరల్ అవ్వడం కోసం ఇదంతా కావాలని చేశారా అని తెలియదు. కాగా అంతమంది కలిసి ఉన్నప్పుడు ఇలాంటివి కామన్ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ధనుష్ నిజంగానే హర్ట్ అయ్యాడా? ఒకవేళ హర్ట్ అయితే ఆ విషయం మన డాక్టర్ బాబు అలియాస్ గౌతమ్ కృష్ణకి అర్థం అయిందా.. అసలేం జరిగిందో తెలియాలంటే అక్కడ వాళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఎవరైన వ్లాగ్ చేస్తే అందులో ఓ క్లారిటీ వస్తుంది. మరి ఇప్పటికైతే వీరిమధ్య కోల్డ్ వార్ లాంటిదేం బయటకు రాలేదు. అయితే శుభశ్రీ రాయగురు తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.