English | Telugu
హరహర మహాదేవ్ గా ప్రిన్స్ యావర్!
Updated : Feb 27, 2024
శివరాత్రికి హరహర మహాదేవ్ అంటు భక్తులు పాడే కీర్తనలు వింటుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. అయితే అలాంటిది ఆ పండుగకి శివుడి గెటప్ లో డ్యాన్సర్ పర్ఫామెన్స్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యావర్ శివుడి గెటప్ లో ఓ పోస్టర్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో రిలీజ్ చేశాడు.
ప్రిన్స్ యావర్ ఈ పేరు గురించి ఇప్పుడు పరిచయం చేయాల్సిన పనిలేదు. మోడలింగ్‌లో సత్తా చాటిన యావర్.. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు సరిగ్గా రాకపోయిన హౌస్‌లో అడుగుపెట్టి అదరగొట్టాడు. చివరివారం వరకు హౌస్‌లో ఉండి గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించాడు. అంతకుముందు ఎవరికి తెలియని యావర్ తెలుగులో ఓ సీరియల్‌లో నటించాడు. ఆ తర్వాత కరోనా సమయంలో ఛాన్సులు లేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు ప్రిన్స్ యావర్. ఏదైనా ఉద్యోగం చేద్దామని అమీర్‌పేట్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అలాంటి యావర్ బిగ్‌బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చి అదరహో అనేలా పర్ఫామెన్స్ చేశాడు. నయని పావని అంటే హౌస్ లోనే క్రష్ ఉన్నట్టు బిహేవ్ చేశాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక యావర్ కి ఫాలోయింగ్ బాగా పెరిగింది. ప్రస్తుతం యావర్ ఇన్ స్టాగ్రామ్ లో 261K ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు.
బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక ప్రశాంత్, శివాజీలతో కలిసి స్పై బ్యాచ్ బాండింగ్ ని కొనసాగిస్తున్నాడు యావర్. శబరిమల అయ్యప్ప స్వాములకి అన్న సంతర్పం చేయడం, పల్లవి ప్రశాంత్ తో కలిసి రీల్స్ చేయడం, నయని పావనితో కలిసి ' కుర్చీ మడతబెట్టి' పాటకి డ్యాన్స్ చేయడం.. ఇలా రెగ్యులర్ ట్రెండింగ్ లోని పాటలకి డ్యాన్స్ లు చేస్తున్నాడు. అయితే త్వరలో ప్రారంభం కానున్న ఓ డ్యాన్స్ షోకి నయని పావని, యావర్ కలిసి జోడీగా చేస్తున్నట్టు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అయితే ఇదిలా ఉండగా మహాశివుడి గెటప్ లో ఓ పోస్టర్ ని రిలీజ్ చేశాడు యావర్. ఇది ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ అని చెప్పిన యావర్.. త్వరలోనే ఫుల్ సాంగ్ విడుదల చేస్తానని చెప్పాడు. అయితే త్వరలో శివరాత్రి పర్వదినం రానుంది. అదే రోజున ఈ పాటని రిలీజ్ చేస్తారేమో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఈ పాటని రిలీజ్ చేస్తే అటు యావర్ ఫ్యాన్స్ కి, ఇటు మహాశివుడి భక్తులకి పూనకాలే. యావర్ కెరీర్ ని మలుపు తిప్పే ఈ పాట ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి మరి.