English | Telugu

నాన్న లేరని తెలిసాక.. ఒకరోజు కార్ లో సడన్ గా అలా!

నాన్నంటే ప్రతీ ఒక్కరికి ఓ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అలాంటిది నాన్న లేకుండా గడిచే సమయం ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. భాద్యతగా ఉండమని మనల్ని తిట్టేవాళ్ళు గానీ అవసరాలని తీర్చేవాళ్ళు గానీ ఉండరు. అలాంటిది నాన్న కళ్ళముందే చనిపోతే ఆ బాధ ఎన్నటికీ తీరదు. రీతు చౌదరి వాళ్ళ నాన్న తన ముందే చనిపోవడంతో తను ఎలా ఫీల్ అయిందో ఓ ఇంటర్వూలో పంచుకుంది.

రీతు చౌదరి , తన అమ్మ కలిసి తాజాగా ఓ ప్రైవేట్ ఇంటర్వూలో పాల్గొన్నారు. అందులో రీతు చౌదరి వాళ్ళ నాన్న గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. ఎప్పుడైన షూటింగ్ ఉంటే నాన్న ఉదయం నాలుగు గంటలకి లేచి టిఫిన్ రెడీ చేసి, భోజనం ప్రిపేర్ చేసి అన్ని ఆమెకోసం రెడీ చేసి ఆ తర్వాత తనని లేపేవారని రీతు వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది. ఒకరోజు రీతు తన మొదటి జీతం డబ్బులతో ఓ కార్ కొనిందని అది అంటే వాళ్ళ నాన్నకి ఇష్టమని చెప్పింది. అయితే సడన్ గా ఓ రోజు మా నాన్న చనిపోయారని అమ్మ చెప్పడంతో కన్నీళ్ళు ఆగలేదు.. అంతా శూన్యం. ఏం చేయాలో తోచలేదు. అదే కార్ లో మా నాన్నని తీసుకెళ్ళాం. అందుకే ఆ కార్ అంటే నాకిష్టం. ఎప్పుడైన కార్ లో ఒక్కదాన్నే వెళ్తే మా నాన్నతో మాట్లాడుకుంటానని రీతు చెప్పింది. ఇక వంట గురించి అడుగగా.. తనకి వంట రాదని, కాఫీ , టీ పెట్టడం కూడా రాదని రీతు వాళ్ళ అమ్మ చెప్పింది. మరి పెళ్ళి తర్వాత ఎలా అని అడుగగా.. అన్నీ వచ్చినవాడినే పెళ్ళి చేసుకుంటుందంట అని రీతు వాళ్ళ అమ్మ చెప్పింది. కాగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటోషూట్ లతో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.