English | Telugu

ప్యానిక్ అవకుండా ఇంటర్ ఎగ్జామ్స్ బాగా రాయండి అన్న రచ్చ రవి...

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షలు అంటే చాలు చాలామంది వచ్చిన ప్రశ్నలనే చూసి, చదివిన పాఠాలే ఐనా రాయడానికి భయపడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో స్టూడెంట్స్ కి మోటివేషన్ ఇస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు కమెడియన్ రచ్చ రవి కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా స్టూడెంట్స్ కి నాలుగు మంచి మాటలు చెప్పాడు. 'పరీక్ష అంటే ముందు టెన్షన్ పడొద్దు, ప్యానిక్ అవ్వొద్దు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు వచ్చే ప్రతీ ప్రశ్న ఏడాది నుంచి మీరు చూసిందే, చదివిందే. కాబట్టి ఎగ్జాంకి వెళ్లే ముందు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఒకసారి రివిజన్ లా చూసుకోండి. కూల్ గా ఎగ్జాంని అటెండ్ చేసి బాగా రాయాలి.. రాస్తారు కూడా..నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు చదివిన లైసెన్స్ కదా.

మరొక్కసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్. బంగారు భవిష్యత్తు మీదే." అంటూ ఇంటర్ స్టూడెంట్స్ కి మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఐతే పిల్లల్ని పరీక్షలకు పంపే ముందు ఇంట్లో పేరెంట్స్ కూడా ఇన్ టైంలో తీసుకెళ్లడం మంచిది అని అలాగే జాగ్రత్తగా తీసుకెళ్లాలని నెటిజన్స్ కోరుతున్నారు. ఆఖరి నిమిషంలో హడావిడి చేసి స్పీడ్ గా వెళ్లొద్దు అని మెసేజ్ చేస్తున్నారు. పిల్లల్ని మరీ టెన్షన్ పడకుండా బాగా రాయాలి రాంక్ రావాలి అంటూ మరీ స్ట్రెస్ పెట్టకుండా చూసుకోవాలి పేరెంట్స్ అంటున్నారు ...అసలే ఎండలు అదిరిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఒక పక్కన ఉక్క మరో పక్క పరీక్ష కాబట్టి వాళ్ళను మరీ ఇబ్బంది పెట్టకుండా ఎగ్జాం సెంటర్స్ దగ్గర కూల్ గా వదిలి రావడం ముఖ్యం అని తెలుసుకోవాలి అంటూ నెటిజన్స్ కూడా పేరెంట్స్ కి టిప్స్ ఇస్తున్నారు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.