English | Telugu

షూటింగ్ అయిపోయిన వెంటనే శ్రీముఖి ఆ పని చేస్తుందంట!

సినిమా తారలైన, బుల్లితెర నటీనటులైన ఎవరైన సరే షూటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు.‌ .. ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా.. ఎస్ ఇదే ఇప్పుడు వైరల్ అయింది. అసలు విషయం ఏంటంటే శ్రీముఖి ఓ షూటింగ్ తర్వాత ఏం చేస్తుందో సింగర్ శ్వేత మోహన్ ఓ ఇంటర్వూలో తెలిపారు.

ధనుష్, సంయుక్త మీనన్ నటించిన ' మాస్టర్' సినిమాలోని మాస్టారు మాస్టారు పాటతో విపరీతమైన క్రేజ్ పొందిన శ్వేత మోహన్ కి ప్రశంసల వర్షం కురిసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫేస్ బుక్ లో ఎక్కడ చూసిన శ్వేత మోహన్ గారి పాటే.. మరి ఆమె తాజాగా స్టార్ మా టీవీలో మొదలైన సూపర్ సింగర్ షోలో వన్ ఆప్ ది జడ్డ్ గా చేస్తోంది. అయితే ఈ షోలో తాజాగా ఓ అమ్మాయి శ్వేత మోహన్ పాడిన పాటే పాడగా .. తను ఇంప్రెస్ అయింది. అ తర్వాతే తనే స్వయంగా స్టేజ్ మీదకి వచ్చి ఆ అమ్మాయితో కలిసి పాడడంతో అది వైరల్ అయింది. ఇక తాజాగా శ్వేత మోహన్ ఓ ఇంటర్వూలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. " నేను వెళ్ళేసరికి శ్రీముఖి షూటింగ్ ప్రారంభిస్తుంది. ఇక తన టైమ్ స్లాట్ అయిపోగానే అసలు కొంచెం కూడా టైమ్ వేస్ట్ చేయకుండా వెళ్లిపోతుంది. అందుకే ఆమెతో నాకు ఎక్కువగా బాండింగ్ లేదు. కానీ తనకి నేను అభిమానిని అని శ్వేత మోహన్ చెప్పుకొచ్చింది.

శ్రీముఖి సెట్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది‌. అందరికి పాజిటివ్ వైబ్స్ ని తెప్పించేలా మాట్లాడుతుంది. బయట మా ఇద్దరికి ఎక్కువ బాండింగ్ లేదు. ఎందుకంటే ఎవరి బిజీ వారిది. ఇక షూటింగ్ అవ్వగానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే తనకి ఇక్కడ షూటింగ్ అవ్వగానే వేరేచోట మరో షూటింగ్ ఉంటుంది. అందుకే అలా వెళ్ళిపోతుందని శ్రీముఖి గురించి శ్వేత మోహన్ చెప్పుకొచ్చింది. శ్రీముఖి బుల్లితెరపై సందడి చేస్తూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. యాంకర్‌గా పరిచయం కాకముందు కొన్ని సినిమాల్లో నటించినా అవి శ్రీముఖికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. బుల్లితెరపై రకరకాల షోలు చేస్తూ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. ఏదైనా అనుకోని ఘటన జరిగినపుడు సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది.